English   

ఒక్క సినిమాలో 16 మంది హీరోయిన్లు.. విజ‌య్ సంచ‌ల‌నం..

Vijay playing a football coach role in Atlee's film
2019-01-03 04:25:49

ఒక్క సినిమాలో 16 మంది హీరోయిన్లా.. అక్కడ ఉన్న హీరో ఏమైనా కృష్ణుడా.. అంత‌మందితో రొమాన్స్ చేయ‌డానికి..? లేకపోతే మరేంటి ఒక్క సినిమాలో 16 మంది ముద్దుగుమ్మలు నటించడం ఏంటి..? అసలు అంత మందిని ఒక దర్శకుడు ఎలా బ్యాలెన్స్ చేస్తాడు..? ఎంతమందికి ఎన్ని సీన్స్ ఇస్తాడు.. ఇలా చాలా అనుమానాలు వస్తాయి. కానీ ఇప్పుడు వీటన్నింటిని పక్కనపెట్టి అట్లీకుమార్ నిజంగానే ఒక సినిమాలో 16 మంది హీరోయిన్లను తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈయన విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరిలోనే మొదలు కానుంది. దసరాకు సినిమా విడుదల కానుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్ గా నటించబోతున్నాడు విజయ్. అది కూడా మహిళల ఫుట్బాల్ టీమ్ టీమ్ కోచ్ గా. కాబట్టి ప్రస్తుతానికి ఇదే శిక్షణ తీసుకుంటున్నాడు దళపతి. ఇక అట్లీ కుమార్ మాత్రం ఇందులో కావాల్సిన ఫుట్బాల్ టీమ్ కోసం అమ్మాయిలను ఎంచుకొనే పనిలో బిజీగా ఉన్నాడు. 16 మంది ముద్దుగుమ్మల కోసం వేట సాగిస్తున్నాడు ఈ దర్శకుడు.
ఇందులో ముఖ్యంగా దాదాపు అరడజను మంది హీరోయిన్లను ఎంచుకున్నాడు దర్శకుడు అట్లీ కుమార్. 16 మందిలో అందరూ తెలిసిన మొహాలు ఉంటే సినిమాకు కూడా క్రేజ్ వస్తుందని నమ్ముతున్నారు అట్లీ. అందుకే ఎంత మంది వీలైతే అంత మంది హీరోయిన్లను తీసుకోవాలని చూస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఒక్కసారి క్యాస్టింగ్ ఫైనల్ అయితే సినిమా పట్టాలెక్కుతోంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో వ‌స్తుంది ఈ చిత్రం. ఒలంపిక్స్ నేపథ్యం కావడంతో చాలా మంది క్రీడా విశ్లేషకులు దగ్గర కూర్చొని తన కథను సిద్ధం చేసుకున్నాడు అట్లీ కుమార్. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి. వీళ్ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన తెరీ.. మెర్స‌ల్ సినిమాలు సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు ఈ జోడి. 

More Related Stories