English   

16 వయదినిలే.. సరికొత్తగా 43 ఏళ్ల తర్వాత విడుదల..

 16 Vayathinile
2020-06-15 08:04:47

ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన సినిమా 16 వయదినిలే. లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. 1977లో విడుదలైన 16 వయదినిలే సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది ఈ సినిమా. ఇందులో రజనీకాంత్ విలన్ గా నటించాడు. ఇదే సినిమాను తెలుగులో రాఘవేంద్రరావు పదహారేళ్ళ వయసు పేరుతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్ పాత్రలో చంద్రమోహన్.. రజనీకాంత్ పాత్రలో మోహన్ బాబు నటించారు. శ్రీదేవి ఈ ఒక్క సినిమాతోనే సూపర్ స్టార్ అయిపోయింది. ఇదిలా ఉంటే పదహారేళ్ళ వయసు ఒరిజినల్ వెర్షన్16 వయదినిలే సినిమాను ఇప్పుడు సరికొత్తగా డిజిటల్ సౌండ్ తో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 5 బాషల్లో16 వయదినిలే సరికొత్త వర్షన్ విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాకు నీ కోసమే నిరీక్షణ అనే పేరు కన్ఫర్మ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

More Related Stories