రజనీ 168కి టైటిల్ ఫిక్స్...అదే

సూపర్ స్టార్ రజనీకాంత్ తన వయసును ఏ మాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలతో పోటాపోటీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా లైన్ లో పెడుతూ పోతున్నాడు. తాజాగా మురుగదాస్ డైరెక్షన్లో దర్బార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన 168వ సినిమా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఖుష్బూ, మీనా లాంటి ఎందఱో నటిస్తోన్న ఈ సినిమాలోలో కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గురించి బోలెడు ప్రచారాలు జరిగాయి. తాజాగా ఈ సినిమాకు `అన్నాత్తే` అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రకటించారుశారని టాక్. ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ నుంచి ఈ పేరు తీసుకున్నట్లు సమాచారం. శివ గత సినిమల్లానే ఈ సినిమా కూడా మాస్ కథాంశంతో సాగుతుందని టాక్. ఈ సినిమా తర్వాత రజనీ ఖైదీ ఫేం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ వేసవి కల్లా అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది.