English   

17 ఏళ్ల కెరీర్ లో బన్నీ వదిలేసిన సినిమాలివే..

alluarjun
2020-04-04 19:42:53

గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి 2003లో పరిచయం అయ్యాడు బన్నీ. ఈ మధ్యే ఇండస్ట్రీలో తన 17 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నాడు బన్నీ. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాడు.. మరెన్నో చూసాడు కూడా. అయితే ఈ ప్రయాణంలో అల్లు అర్జున్ కొన్ని సినిమాలను కాదనుకున్నాడు. తన దగ్గరికి వచ్చిన కొన్ని కథలు నచ్చక వదిలేసాడు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం..

1. జయం: నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని ముందు బన్నీతో చేయాలనుకున్నాడు తేజ. అప్పటికి గంగోత్రి ఇంకా రాలేదు. కానీ కుదర్లేదు.. అదే నితిన్‌కు వరం అయింది.

2. భద్ర: బోయపాటి శ్రీను తొలి సినిమా ఎందుకో బన్నీకి కుదర్లేదు.. కానీ అదే కాంబోలో తర్వాత వచ్చిన సరైనోడు సంచలనం సృష్టించింది.

3. 100 పర్సెంట్ లవ్: సుకుమార్ లెక్కలు ఆ సమయానికి బన్నీకి అర్థం కాలేదు.. అందుకే ఈ లవ్ స్టోరీ చైతూకు వెళ్లిపోయింది.

4. పండగ చేస్కో: గోపీచంద్ మలినేని సినిమాలో ముందు బన్నీనే ఉండాల్సింది కానీ చివరి నిమిషంలో లెక్కలు మారి రామ్ వచ్చాడు.

5. కృష్ణాష్టమి: వాసు వర్మ ముందు నుంచి కూడా ఈ చిత్రాన్ని బన్నీతో లవర్ పేరుతో చేయాలనుకున్నాడు కానీ కుదర్లేదు.

6. ఒక లైలా కోసం: విజయ్ కుమార్ కొండా చెప్పిన కథ నచ్చి అల్లు అర్జున్ ఈ సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదర్లేదు.. చైతూకు అలా వెళ్లిపోయింది.

7. అర్జున్ రెడ్డి: ఈ సినిమాను వదిలేసుకున్నందుకు బన్నీ కూడా బాధ పడ్డాడేమో.. కానీ పైకి చెప్పలేదంతే. ముందు సందీప్ ఈ కథ కోసం బన్నీని అడిగినట్లు ప్రచారం అయితే ఉంది ఇండస్ట్రీలో.

8. గ్యాంగ్ లీడర్: విక్రమ్ కే కుమార్, బన్నీ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి మరీ ఆగిపోయింది. కథ విషయంలో తేడా వచ్చి బన్నీ వద్దనుకున్నాడు ఈ చిత్రాన్ని.

9. డిస్కో రాజా: ఐడియా నచ్చి విఐ ఆనంద్‌తో సినిమా చేయాలనుకున్నాడు కానీ చివర్లో ఎందుకో వెనక్కి తగ్గాడు అల్లు అర్జున్.

10. జాను: ముందు ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను తీసుకోవాలని దిల్ రాజు చాలా ట్రై చేసినా కూడా కుదర్లేదు. అసలు 96 సినిమా రీమేక్ చేయాలనే ఆలోచనే బన్నీకి నచ్చలేదు.

11. గీత గోవిందం: పరుశురామ్ చెప్పిన కథ నచ్చినా కూడా ఎందుకో తన ఇమేజ్‌కు సరిపోదనే ఆలోచనతో గీత గోవిందం వదిలేసుకున్నాడు బన్నీ.

12. అరవింద సమేత: త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చినా.. ఆ టైమ్‌లో బన్నీకి ఈ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదంతే.. ఆ తర్వాతే అల వైకుంఠపురములో సినిమాతో వచ్చి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసారు ఈ జోడీ.

More Related Stories