English   

ఆర్య @17 ఏళ్లు..బ‌న్నీఎమోషనల్ పోస్ట్

Allu Arjun
2021-05-07 12:43:28

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ కు ఇమేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ఆర్య అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అంతే కాకుండా ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కు ఎంతో మంది అభిమానులయ్యారు. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అను మెహ్తా హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా 2004 లో వ‌చ్చిన ఈ సినిమాలో శివ‌బాల‌జీ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. సుకుమార్ ఫీల్ మై ల‌వ్ అంటూ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. 

ఈ సినిమా త‌రవాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో ఆర్య 2 సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ ఆర్య అంత విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక ఇప్పుడు సుకుమార్ బ‌న్నీ కాంబినేష‌న్ లో మూడో సినిమాగా పుష్ప తెర‌కెక్కుతోంది. దాంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. 

ఇదిలా ఉండ‌గా ఆర్య సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నేటితో 17 ఏళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ ఎమోష‌న్ పోస్ట్ ను షేర్ చేశారు. ఆర్య సినిమా వ‌చ్చినేటికి పదిహేడేళ్ల‌యింది. ఈ సినిమా నాజీవితంలో ఓ మిరాకిల్. అంతే కాకుండా నా జీవితాన్ని మార్చేసిన సినిమా. ప్రేక్ష‌కులు నన్ను అభిమానించ‌డం ఈ సినిమాతోనే మొద‌లైంది. అంటూ బ‌న్నీ ఎమోష‌నల్ పోస్ట్ పెట్టారు.   

More Related Stories