English   

18 కోట్లకు అమ్ముకున్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra Nick Jonas Wedding Photo Rights Sold With Huge Amount
2018-11-13 07:15:35

ప్రియాంక చోప్రా ఏంటి.. అమ్ముకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. సాధార‌ణంగా మిడిల్ క్లాస్ పెళ్లిల్లో ఫోటోలు తీస్తే డ‌బ్బులివ్వాలి.. కానీ సెలెబ్రెటీస్ పెళ్లిలో మాత్రం ఫోటోలు తీసుకుంటున్నందుకు డ‌బ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇదే చేస్తుంది. డిసెంబర్‌ 2న త‌ను ప్రేమించిన నిక్ తోనే జోధ్‌పూర్‌లో రాచరికపు పద్ధతిలో ప్రియాంక చోప్రా పెళ్లి జరగనుంది. దీని ఏర్పాట్లు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఆ పెళ్లి ప్రాంగ‌నాన్ని నిక్‌-ప్రియాంక జోడీ వెళ్లి పరిశీలించి వచ్చారు. నెల రోజుల పాటు పూర్తిగా త‌మ పెళ్లి ప‌నుల్లోనే మునిగిపోనున్నారు ఈ జంట‌. ఇదిలా ఉంటే వీళ్ల పెళ్లి ఫోటోలు కూడా భారీ రేట్ కు అమ్ముడైపోయాయి. ప్రియాంక చోప్రా-నిక్‌ జొనాస్ ఎక్స్ క్లూజివ్ పెళ్లి ఫొటోల కోసం ఓ మ్యాగ‌జైన్ ఏకంగా 18 కోట్లు చెల్లించింది ప్రియాంక చోప్రాకు. సెలెబ్రెటీస్ వివాహాల‌కు ఇలా డ‌బ్బులిచ్చి రైట్స్ తీసుకోవ‌డం ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోయింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇదే చేసింది.

Priyanka Chopra Nick Jonas Wedding Photo Rights Sold With Huge Amount

త‌న పెళ్లి ఫోటోలు తీసుకోడానికి ఏకంగా 18 కోట్లు డీల్ మాట్లాడుకుంది. మొన్నీమ‌ధ్యే పెళ్లికూతుర్ని కూడా చేసారు ఈ భామ‌ను. ఈ ఈవెంట్‌లో ఆమె పెట్టుకున్న నగలు దాదాపు 7.5 కోట్లకు పైగానే ఉంటాయ‌ని తెలుస్తుంది. ఈమె ధ‌రించిన జ్యూయెల‌రీ పేరు కూడా టిఫానీ అండ్ కో. ప్రియుడు ఫారెన్ నుంచి ఇవి తెప్పించాడ‌ని తెలుస్తుంది. పైగా ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ నిక్ జొనాస్ 2.10 కోట్ల విలువైన ఎంగేజ్‌మెంట్ రింగ్ తో కలిసి ఈ ఈవెంట్ కోసం ప్రియాంక పెట్టుకున్న న‌గల విలువ 10 కోట్లకు చేరిపోయింది. డిసెంబ‌ర్ 2న జోధ్ పూర్ లోని ఓ బంగళాలో మూడు రోజుల పాటు ప్రియాంక పెళ్లి జ‌ర‌గ‌నుంది. దీనికి అతి త‌క్కువ మంది హాజ‌రు కానున్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు కూడా చాలా త‌క్కువ మందికే ఆహ్వానాలు వెళ్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ప్రియాంక చోప్రా పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది.

Priyanka Chopra Nick Jonas Wedding Photo Rights Sold With Huge Amount

More Related Stories