English   

ఆగస్ట్ 18న సాహో ఆడియో వేడుక.. భారీగా జరుగుతున్న ఏర్పాట్లు.. 

Saaho
2019-08-09 07:42:31

సాహో సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఆగస్ట్ 30న విడుదల కానుంది ఈ చిత్రం. దాంతో ప్రమోషన్స్ కూడా జోరు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 10న ట్రైలర్ విడుదల కానున్నట్లు అనౌన్స్ చేసారు. ఇక ఇప్పుడు ఆడియో వేడుకకు కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు. ఆగస్ట్ 18న ఆర్ఎఫ్సీలో భారీగా ఈ వేడుక జరగబోతుంది. దీనికి అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యంగా హిందీలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఇక తమిళనాట కూడా భారీగానే వస్తుంది సాహో. తెలుగు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భారీగానే ఈ వేడుకకు రానున్నారు. అందుకే ఎక్కడా ఏ చిన్న పొరపాటు కూడా జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్ర యూనిట్. పది రోజుల ముందు నుంచే ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ఎఫ్సీలో దీనికోసం సెట్స్ కూడా వేస్తున్నారు. సాహో సినిమాను 300 కోట్లతో నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్. దాంతో దానికి తగ్గట్లుగానే ఇప్పుడు సెట్ల నిర్మాణం కూడా భారీగానే జరుగుతుంది. ఆడియో వేడుకతోనే సినిమా రేంజ్ ఏంటో చూపించాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు జిబ్రన్ సంగీతం అందిస్తున్నాడు.

More Related Stories