English   

అక్టోబర్ 18న ఆవిరి పట్టనున్న రవిబాబు.. 

aaviri
2019-10-07 06:15:27

రవిబాబు సినిమాలంటేనే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. రొటీన్ సినిమాలకు చాలా దూరంగా తన సినిమాలను తెరకెక్కిస్తుంటాడు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఏ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం ఆవిరి. ఈ సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌ కానుంది. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు మాట్లాడుతూ ``రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న మా  చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న ప్రేక్షకుల ముంద‌కు తీసుకువ‌స్తున్నాం. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా,థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది`` అన్నారు. టీజర్ చూస్తుంటే మరోసారి రొటీన్ ఆత్మకథతోనే వస్తున్నాడు రవిబాబు. అయితే ఈయన ఎప్పుడు కథ రాస్తాడో చెప్పడం కష్టమే. మరి ఈ ఆవిరి ఆయన కెరీర్ కు ఊపిరి పోస్తుందో లేదో చూడాలి. 

More Related Stories