కరోనా లాక్ డౌన్ అయినా 18 పేజీస్ ఆగట్లేదు

దర్శకుడు సుకుమార్ ఒక వైపు సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కిస్తూనే మరో వైపు మంచి చిత్రాలని నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బేనర్లో వచ్చిన కుమారి 21 ఎఫ్ అనే చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ నిర్మాణ సంస్థ నుండి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు సుక్కూ. అది కూడా తన సొంత కధలనే ఆయన సినిమాలు శిష్యుల చేత చేయిస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ సంస్థ జీఏ2 పిక్చర్స్ తో కలిసి ఒక సినిమాని నిర్మిస్తోంది. నిఖిల్ హీరోగా రూపొందనున్న ఈ సినిమా మొన్ననే లాంచ్ అయింది. 18 పేజెస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనుండగా, మూవీకి స్టోరీ, స్క్రీన్ప్లే సుకుమార్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఇప్పటికే షూట్ మొదలు కావాల్సి ఉంది. అయితే కరోనా నేపధ్యంలో ఈ సినిమా ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేదు. అయితే ఈ ఖాళీ సమయంలో ఈ మేకర్స్ ఖాళీగా కూర్చో లేదు. ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ని వీడియో కాల్ ద్వారా ఈ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, సంగీత దర్శకుడు గోపీ సుందర్ చేస్తున్నట్టు ప్రకటించింది యూనిట్. బయట లాక్ డౌన్ అయితేనేంటి మాకు నో ప్రాబ్లం మా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇలా వీడియో కాల్ లో కానిస్తున్నామని గీతా ఆర్ట్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది.