English   

నిఖిల్ 18 పేజెస్ లో హీరోయిన్ గా అనుపమ ..

Anupama Parameswaran
2020-05-11 11:27:13

ద‌ర్శకుడు సుకుమార్ ఒక‌ వైపు సక్సెస్ ఫుల్ సినిమాలు తెర‌కెక్కిస్తూనే మ‌రో వైపు మంచి చిత్రాల‌ని నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బేన‌ర్‌లో వ‌చ్చిన కుమారి 21 ఎఫ్ అనే చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ నిర్మాణ సంస్థ నుండి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు సుక్కూ. అది కూడా తన సొంత కధలనే ఆయన సినిమాలు శిష్యుల చేత దర్శకత్వం చేయిస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ తో క‌లిసి ఒక సినిమాని నిర్మిస్తోంది. నిఖిల్ హీరోగా రూపొంద‌నున్న ఈ సినిమా మొన్ననే లాంచ్ అయింది. 18 పేజెస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని కుమారి 21 ఎఫ్ దర్శకుడు ప‌ల్నాటి సూర్య ప్రతాప్ తెర‌కెక్కించ‌నుండ‌గా, మూవీకి స్టోరీ, స్క్రీన్‌ప్లే సుకుమార్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఇప్పటికే షూట్ మొదలు కావాల్సి ఉంది. 

అయితే కరోనా నేపధ్యంలో ఈ సినిమా ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేదు. అయితే అంతా లాక్ డౌన్ అయిన ఈ సమయంలో కూడా మేకర్స్ ఖాళీగా కూర్చో లేదు. ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అంశం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని సుకుమార్ ఫైనల్ చేశారని కాదు కాదు అను ఇమ్మానుయేల్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి ఇప్పుడు తెలుగులో అనుపమ ఎటువంటి సినిమా ఒప్పుకోలేదు. నిజానికి నిఖిల్ హీరోగా నటిస్తోన్న కార్తికేయలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకుంటున్నారని ప్రచారం జరిగినా అది కూడా అధికారికంగా కన్ఫాం కాలేదు.

More Related Stories