English   

ఆర్ఆర్ఆర్ కోసం 18 కోట్ల సెట్ 

RRR
2020-06-04 13:07:38

ఒక తెలుగు సినిమా గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు అంటే అది ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్ చేసిన రాజమౌళి ఆ తరువాత ఈ సినిమా గురించి ఏమీ ప్రకటించకపోయే సరికి ఈ సినిమా గురించి రోజుకు వంద పుకార్లు పుట్టుకొచ్చేవి. దీంతో ఎందుకు వచ్చిన గోల అనుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు కూడా. అయినా ఇప్పటికీ ఆ పుకార్లు ఆగలేదు అనుకోండి అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరో సారి ఆ సినిమా వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ సినిమా కోసం జక్కన్న వేసుకున్న అన్ని ప్లాన్స్ ని కరోనా లాక్ డౌన్ మార్చేసింది. ఆయన ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుత లొకేషన్స్ మార్క్ చేసి పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు ఆయన ఎంచుకున్న లొకేషన్స్ లో షూటింగ్ చేయడానికి వీలు లేని పరిస్థితి. కనీసం రాష్ట్రం దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాదులోనే భారీ సెట్స్ వేసి సింహ భాగం షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం ఇప్పటికే టీమ్ ఒక భారీ సెట్ రెడీ చేయిస్తుందని అంటున్నారు. ఈ సెట్ ఖరీదు సుమారుగా 20 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ కరోనా ఆర్ఆర్ఆర్ బడ్జెట్ ను పెంచుతుందా ? పెంచితే ఏమేరకు పెంచుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories