English   

యూత్ ని టార్గెట్ చేస్తూ 18 పేజెస్ ఫస్ట్ లుక్

Nikhil 18 pages
2021-06-01 14:04:28

యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సుకుమార్ సమర్పిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తోంది.  ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్. నేడు నిఖిల్ పుటిన రోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. చిత్రయూనిట్ తరఫున నిఖిల్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్.. నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నారని తెలిపారు. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు.

''నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' అని ఆ పేపర్‌పై రాసి ఉండటం సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది.

More Related Stories