English   

నిఖిల్ ‘18 పేజెస్’ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు.

18 Pages in dubbing phase
2021-08-12 17:33:06

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. 

హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన డబ్బింగ్ మొదలు పెట్టారు. ఓ వైపు షూటింగ్.. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సినిమాటోగ్రఫర్: ఏ వసంత్, ఎడిటర్: నవీన్ నూలి, సంగీతం: గోపీ సుందర్, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్, కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్, దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్.

More Related Stories