English   

 రానా హిర‌ణ్య‌క‌శ్య‌ప బ‌డ్జెట్ 180 కోట్లు..

Rana
2018-11-06 15:50:47

విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. సురేష్ బాబు సైతం ఈ విష‌యం క‌న్ఫ‌ర్మ్ చేసాడు. రానా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 9 ఏళ్లైపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న‌కు సోలో మార్కెట్ పెద్ద‌గా రాలేదు. నేనేరాజు నేనేమంత్రి.. ఘాజీ లాంటి సినిమాలు విజ‌యం సాధించినా కూడా అవి మ‌రీ 40-50 కోట్లైతే తీసుకురాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్ల మార్కెట్ కూడా లేని హీరో రానా. అలాంటి హీరోపై ఇప్పుడు ఏకంగా 180 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌డం అనేది నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అయితే అన్ని డ‌బ్బులు ఎవ‌రో బ‌య‌టి నిర్మాత రానాపై ఎందుకు పెడ‌తాడు.. ఏ ధైర్యంతో పెడ‌తాడు.. అందుకే తండ్రే ఈ సాహ‌సం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే రానాపై 180 కోట్లు పెట్ట‌డానికి రెడీ అవుతున్నాడు సురేష్ బాబు. ఈయ‌న హీరోగా హిర‌ణ్య క‌శ్య‌ప సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలిస్తే మ‌రో షాక్ త‌గులుతుంది. రుద్ర‌మ‌దేవి సినిమాతో ప‌ర్లేద‌నిపించిన గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. రానా ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమాలు పూర్తికాగానే హిర‌ణ్య క‌శ్య‌ప మొదల‌వుతుందని చెప్పాడు సురేష్ బాబు. 2019లో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ఖాళీ అయిపోయాడు. మ‌రి నిజంగానే రానా కోసం సురేష్ బాబు 180 కోట్లు పెడ‌తాడా.. పెడితే అవి తిరిగి వ‌స్తాయా..? 
 

More Related Stories