English   

బిగ్ బాస్ కి కరెక్ట్ మొగుడు ఐపీఎల్.. సెప్టెంబర్ 19న వార్..

 IPL 2020 BIGG BOSS 4
2020-09-10 11:33:30

బిగ్ బాస్ సీజన్ 4 అంగరంగ వైభవంగా మొదలైంది. ఒకవైపు కరోనా వైరస్ నడుస్తున్నా కూడా స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ పై భారీ బడ్జెట్ పెట్టింది. ఇందులోకి సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ లు 16 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి ఇంట్లోకి అడుగు పెట్టారు. దాంతో షోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గినా కూడా రేటింగ్స్ కూడా భారీగా పడిపోతాయనే విషయం నిర్వాహకులకు తెలియంది కాదు. అందుకే వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ కు అసలైన మొగుడు ఐపీఎల్ రూపంలో వస్తున్నాడు. ప్రతిసారి ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ మొదలయ్యేది. కానీ ఈసారి కరోనా వైరస్ పుణ్యమాని రెండూ ఒకేసారి వస్తున్నాయ్. 

ఇప్పటికే సెప్టెంబర్ 6న బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. దీనికి సరిగ్గా 13 రోజుల తర్వాత సెప్టెంబర్ 19 ఐపీఎల్ 13వ సీజన్ మొదలవుతుంది. అది కూడా దుబాయిలో.. స్టేడియంలో ప్రేక్షకులు ఎవరు లేకుండా ఈసారి క్రికెట్ ఆడబోతున్నారు. చాలా రోజులుగా అసలైన ఎంటర్టైన్మెంట్ కోసం వేచి చూస్తున్న ఆడియన్స్ కు అసలు సిసలైన మజా ఇవ్వడానికి ఐపీఎల్ వచ్చేస్తుంది. పైగా ఇది సాయంత్రం 7:30 కి మొదలు కాబోతుంది. రాత్రి 11:00 వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. మరోవైపు బిగ్ బాస్ 9:30 కి మొదలవుతుంది. ఈ రెండింటికి కచ్చితంగా రేటింగ్స్ విషయంలో పెద్ద యుద్ధం జరగడం ఖాయం. మరి ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది చూడాలి.

More Related Stories