English   

ఫిబ్రవరి 19 నుండి మార్చ్ వరకు రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ఇవే

Telugu Movies 2021
2021-02-17 11:58:31

కరోనా లాక్ డౌన్ తో చాలా సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. మరో వైపు సినిమా ల షూటింగ్ కూడా ఆలస్యం అయ్యింది. ఇక ప్రస్తుతం లాల్ డౌన్ ఎత్తివేయడంతో పాటు 100 శాతం సీటింగ్ పర్మిషన్ ఇవ్వడంతో వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని వరుసగా వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీ పుణ్యమా అని సినిమాలు విడుదలయ్యే సంఖ్య కూడా పెరుగుతోంది. కొన్ని సినిమాలు థియేటర్ల ను నమ్ముకుంటే మరికొన్ని సినిమాలు ఓటీటీలను నమ్ముకుంటున్నాయి. ఇక ఈనెల 19 నుండి మార్చ్ 5 వరకు ఏకంగా పది సినిమాలు విడుదలకు సిద్ధంగా  ఉండటం విశేషం. సినిమాల లిస్ట్ చూస్తే ఫిబ్రవరి 19న..నాంది, కపటదారి,పొగరు, చక్ర విడుదల కానున్నాయి. 

ఫిబ్రవరి 26 న JD స్ 70 MM, అంగుళిక, చెక్, సిండ్రెల్లా, అక్షర విడుదల కానున్నాయి. మార్చి 5 న దేవినేని, షాది ముబారక్, గజాకెసం, పవర్ ప్లే,ప్లే బాక్, A1 EXPRESS, ఏకం, ఆరడుగుల బులెట్ ?, రాయ్ అండ్ లాస్ట్ డ్రాగన్ విడుదల కానున్నాయి. వీటిలో సందీప్ కిషన్ ఏ 1.ఎక్స్ప్రెస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్ మరియు టీజర్ ఆకట్టుకోగా మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా దీనిని తెరకెక్కించారు. అంతే కాకుండా నితిన్ చెక్ పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు తాజాగా విడుదలైన అక్షర సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఒక డిఫరెంట్ జోనర్ లో వస్తోంది. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ డేట్ లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Related Stories