రోజా, సెల్వమణి దంపతులకు 19వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకులు రోజా, ప్రముఖ దర్శకులు సెల్వమణి దంపతుల 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ అన్యోన్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. దర్శకుడు సెల్వమణిని రోజా 2002లో ఆగష్టు 21న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అడ్డంకులును దాటుకుంటూ.. అనుకున్నది సాధిస్తూ.. జీవితంలో ముందుకు సాగుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. ఓ వైపు రాజకీయ నాయకురాలుగా అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేస్తూ.. మరో వైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రోజా. అవధులు లేని ఆనందంతో.. ప్రేమానురాగాలతో.. మీ జీవితం ఆనందంగా సాగాలి అంటూ సన్నిహితులు, మిత్రులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
రోజా - సెల్వమణి దంపతుల 19వ వివాహ వార్షికోత్సవ వేడుకలు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రోజా దంపతులు కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని సన్నిహితులతో పంచుకున్నారు.