English   

పలాస 1978 రివ్యూ

palasa
2020-03-06 15:11:37

నూతన దర్శకుడు కరుణకుమార్‌ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన సినిమా పలాస 1978. 1978లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ట్రైలర్ రిలీజ్ అయ్యే దాకా ఎటువంటి అంచనాలు లేవు. ఎప్ప్దయితే ట్రైలర్ రిలీజయిందో సినిమా మీద అంచనాలు వచ్చేశాయి. మరి ఈ సినిమా ఏమేరకు అంచనాలు అందుకుందో చూద్దాం.


కథ:

ఈ సినిమా కథ ఒక మర్డర్ తో మొదలవుతుంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్న మోహన్ రావు(రక్షిత్) అనే పాత రౌడీ షీటర్, గణప వాసు అనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని చంపడంతో ఈ కధ మొదలవుతుంది. మోహన్ రావు, రంగారావు అన్నదమ్ములు, తక్కువ కులానికి చెందిన వీరు పద్యాలు పాడుకుంటూ బతుకుతుంటారు. అలాంటి వారు కత్తి పట్టి ఆ కత్తికి ఒకరు బాలి కాగా మరొకరు చచ్చి బ్రతికి ఊరు విడవాల్సి వస్తుంది. అయితే కళాకారులు ఎందుకు కత్తి పట్టారు ? ఎవరి కోసం పట్టారు ? అనేది తెర మీద చూడాల్సిందే.  

విశ్లేషణ:

రక్షిత్, నక్షత్ర జంటగా, కరుణకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రోటీన్ సినిమా. అంటే రొటీన్ స్టోరీ ఉన్న సినిమా. అయితే అంతా శ్రీకాకుళం జిల్లా యాసలో సినిమాని నడపడం కొంత వరకూ ప్లస్ అని చెప్పచ్చు. ఇక సినిమా మొదలు పెట్టింది మొదలు ఫస్టాఫ్ దాకా ఏకబిగిన ఉత్కంటగా మారింది. ఇక సెకండాఫ్ మొదలయ్యాక అంతా ప్రేడిక్టబుల్ గా ఉండడంతో కొంత మేర నిరాశ పరిచే అవకాసం ఉంది. ఇక ఈ సినిమాకి రఘు కుంచె బాగా ప్లస్ అయ్యాదు. నెగటివ్ రోల్ లో ఆయన యాక్టింగ్, సంగీత దర్శకుడిగా ఆయన అందించిన మ్యూజిక్ మరియు బిజిఎం బాగా కుదిరి సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్ళాయి. శ్రీకాకుళం జిల్లా యాస, వారి బాషలో భాగమైన అన్నిటినీ చూపడం బాగింది.

నటీనటులు :

లండన్ బాబులు ఫేం రక్షిత్ చక్కని నటన్నని కనబరిచాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్ రెడ్డిలో కనిపించిన తిరువీర్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. నక్షత్ర తెర మీద అందంగా కనిపించడమే కాదు కొన్ని పాటలతో అలరించింది. చెప్పుకోదగ్గ పాత్ర అంటే ఆరెక్స్ 100 లక్ష్మన్, జగదీశ్, తన్మయిలు తమ తమ పాత్రలలో జీవించారు. సెబాస్టియన్ గా నటించిన వ్యక్తి కూడా తన పాత్రను ఎలివేట్ చేసుకున్నాడు. మిగతా వారు తమ తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం:

రఘు కుంచె సంగీతం సినిమాకి ప్రాణం అని చెప్పాలి. రొటీన్ కధతో రెండున్నర గంటల సేపు కూర్చోబెట్టగలిగిన దర్శకుడి ప్రతిభతో పాటూ సంగీత దర్శకుడి చలవా ఉంది. దళిత కార్డ్ వాడిన సినిమాలు ఆడడం ఎక్కడా హిస్టరీలో లేదు, ఏదో విమర్శకులు ఆహా ఓహో అనచ్చు గాక కానీ, ఆడినట్టు చరిత్రలో లేదు. అయితే ఈ సినిమా అందుకు మినహాయింపు పొందవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఆ కార్డ్ వాడినా చాలా కన్విన్సింగ్ గా ఉంది. దర్శకుడి వన్ మ్యాన్ షో అని అయితే చెప్పచ్చు.

ఫైనల్ గా : రియలిస్టిక్ సినిమాలు పెద్దగా ఇష్టపడని వాళ్లు, నాలుగు ఫైట్ లు ఒకటి రెండు లిప్ లాక్ లు, ఒక అరగంట కామెడీ ట్రాక్ కోసం అయితే సినిమాకి వెళ్లొద్దు.

 

More Related Stories