English   

1980ల్లో మహేష్ బాబు ఎలా ఉండేవాడో తెలుసా..

mb
2020-04-14 07:20:52

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుంచి సినిమాల్లోనే పుట్టి పెరిగాడు ఆయన. నాలుగేళ్ల నుంచే నటుడిగా మారిపోయాడు. బాలనటుడిగా దాదాపు 15 సినిమాలు చేసాడు కూడా. ఇక ఇఫ్పుడు ఆయన చిన్ననాటి అరుదైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అది ఇప్పటి ఫోటో కాదు.. దాదాపు 40 ఏళ్ల కింది ఫోటో. 1975లో పుట్టాడు మన సూపర్ స్టార్. నాలుగేళ్లకే నీడ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే అదే సమయంలో దిగిన ఫోటో ఇది. పక్కన ఎవరో ఉన్నారు కానీ అది వాళ్ల బంధువులు అయ్యుంటారనేది విశ్లేషకుల మాట. అందులో డెనిమ్ జాకెట్ ధరింది కెమెరా వైపు క్యూట్ గా చూస్తున్నాడు మహేష్ బాబు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ కుటుంబంతో క్వారంటైన్ టైమ్ గడుపుతున్నాడు సూపర్ స్టార్.

More Related Stories