English   

2.0 ట్రైల‌ర్ నిజంగా బాగుందా..? 

2.0-Trailer
2018-11-05 17:30:01

విడుద‌లైన మ‌త్తులో అంతా భ‌లే ఉంద‌న్నారే కానీ నిజానికి ఇప్పుడిప్పుడే 2.0 ట్రైల‌ర్ అస‌లు టాక్ బ‌య‌టికి వ‌స్తుంది. హాలీవుడ్ సినిమాలా ఉంది.. అక్క‌డి విజువ‌ల్ వండ‌ర్ ఇక్క‌డ క‌నిపిస్తుంది.. శంక‌ర్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేసాడు ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ నిజంగా ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు న‌చ్చింది అనేది మాత్రం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ట్రైల‌ర్ లో విజువ‌ల్ ఎఫెక్ట్స్ త‌ప్ప ఇంకేం క‌నిపించ‌లేదు అనేది ప్ర‌ధాన వాద‌న‌. అస‌లు ఇలాంటి సినిమాల‌కు కాస్తైనా క‌థ ఉండాలి క‌దా.. కేవ‌లం వీడియో గేమ్ మాదిరే అలా విజువ‌ల్స్ ఇచ్చేస్తే ఎలా అనేవాళ్లు కూడా లేక‌పోలేరు. అలాగ‌ని శంక‌ర్ ను త‌క్కువ చేయ‌డం కాదు.. ఆయ‌న చూపించిన విజువ‌ల్ క్లారిటీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అయితే కేవ‌లం అది మాత్ర‌మే ఉంటే సినిమాలు ఆడ‌తాయా అంటే అనుమాన‌మే క‌దా. 

వంద‌ల కోట్లు పెట్టినా కూడా ప్రేక్ష‌కుల‌కు అవ‌స‌రం లేదు.. వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోతే మొహంమీదే రియాక్ష‌న్ ఉంటుంది. అలా చాలా విజువ‌ల్ వండ‌ర్స్ అడ్ర‌స్ లేకుండా పోయాయి కూడా. అయితే ఇప్పుడు 2.0 మాత్రం క‌చ్చితంగా చ‌రిత్ర సృష్టిస్తుంది అని చెబుతున్నాడు ర‌జినీకాంత్. సినిమా ఆల‌స్యం అయిన మాట వాస్త‌వమే అయినా కూడా ఇప్పుడు రావాల్సిన సినిమానే ఇది అంటున్నాడు. ఇందులో మొబైల్స్ వాడ‌కం వ‌ల్ల మ‌నుషుల‌కు ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ వ‌స్తున్నాయో చూపిస్తున్నాడు శంక‌ర్. అయితే అదే క‌థ మెయిన్ థీమ్ గా ఉండి ఆక‌ట్టుకునేలా ఉంటే ఓకే కానీ లేదంటే మాత్రం జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దు. పైగా అటు శంక‌ర్.. ఇటు ర‌జినీ ఇప్పుడు ఇద్ద‌రూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. అన్నింటికీ మించి 2.0 కేవ‌లం 1 గంట 43 నిమిషాల నిడివితో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. మ‌రి దీన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటార‌నేది చూడాలిక‌. 

More Related Stories