English   

2.0 విడుదలైన గంటలోపే పైరసీ పెట్టేస్తాం అని వార్నింగ్

Tamilrockers Open Challenge to Rajinikanth’s 2.0 movie Producers on 2.0 Piracy
2018-11-11 08:57:17

పైర‌సీ.. ఇండ‌స్ట్రీ ఏదైనా నిర్మాత‌ల‌ను నిద్ర పోనీకుండా చేస్తున్న ప‌దం ఇది. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేసి చేసిన సినిమాల‌ను విడుద‌లైన రోజు సాయంత్రానికే నెట్ లో పెట్టేస్తున్నారు కొంద‌రు. మిగిలిన ఇండ‌స్ట్రీలతో పోలిస్తే త‌మిళ‌నాట ఈ పైర‌సీ ర‌చ్చ ఎక్కువ‌గానే ఉంది. అక్క‌డ విడుద‌లైన రోజే నిర్మాత‌ల‌కు చెప్పి మ‌రీ కొన్ని సైట్లు సినిమాల‌ను అప్ లోడ్ చేస్తున్నాయి. ఈ మ‌ధ్యే విజ‌య్ స‌ర్కార్.. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమాల‌ను విడుద‌ల రోజే నెట్ లో పెట్టేసి సంచ‌ల‌నం సృష్టించారు పైర‌సీ దారులు. పెడ‌తాం కాస్కోండి అంటూ చెప్పి మ‌రీ సినిమాల‌ను అప్ లోడ్ చేస్తుంటే చూస్తూ కూర్చోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు నిర్మాత‌లు. ఇప్పుడు 2.0 సినిమాను కూడా లీక్ వీరులు హెచ్చ‌రిస్తున్నారు. అస‌లు ఈ సినిమా విడుద‌లైన గంట‌లోపే సైట్ లో అప్ లోడ్ చేస్తాం చూస్తుండండి అంటూ వార్నింగ్ ఇచ్చింది ప్ర‌ముఖ పైరసీ వెబ్ సైట్ త‌మిళ్ రాక‌ర్స్.

దీనిపై శంక‌ర్ అండ్ టీం చాలా చ‌ర్చించి చ‌ర్య‌లు తీసుకోడానికి రెడీ అవుతున్నారు కానీ వాళ్లు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ఈ పైర‌సీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు త‌మిళ‌నాడు సీనియ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. నిర్మాత‌లే పైరసీకి స‌గం కార‌ణం అవుతున్నారంటూ చెప్పుకొచ్చారాయ‌న‌. ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌కు ఆశ‌ప‌డి త‌మ‌కు తెలియ‌ని దేశాల‌కు కూడా సినిమాల‌ను అమ్మేస్తున్నారని.. వాళ్ల నుంచి కంటెంట్ ను కొంద‌రు పైర‌సీ సైట్లు న‌డిపించే వాళ్లు భారీ మొత్తం కొంటున్నార‌ని.. అలా విడుద‌లైన రోజు సాయంత్ర‌మే సినిమాల‌ను నెట్ లో పెట్టేస్తున్నార‌ని చెబుతున్నాడు తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. ఆలోచిస్తుంటే ఈయ‌న చెప్పిన దాంట్లో కూడా నిజం లేక‌పోలేదు. నిర్మాత‌ల‌కు మ‌రీ అంత డ‌బ్బు ఆశ‌ కూడా ప‌నికిరాదు క‌దా..! అస‌లు ఆ దేశంలో త‌మ సినిమా చూస్తారో లేదో కూడా తెలియ‌కుండా రైట్స్ కోసం సినిమాను అమ్మేస్తే ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయి మ‌రి..!

More Related Stories