English   

2.0తో రోబోకు సంబంధం లేదంటున్న ర‌జినీకాంత్..

Rajinikanth
2018-11-20 11:55:35

అదేంటి.. సీక్వెల్ సినిమాను ప‌ట్టుకుని ర‌జినీకాంత్ ఏంటి అలా అనేసాడు అనుకుంటున్నారా..? మ‌రి ఏం చేస్తాం ఇప్పుడు ఇలా అన్న‌ది స్వ‌యంగా ర‌జినీకాంతే. ఆయ‌నే 2.0 సినిమాతో రోబోకు సంబంధం లేద‌ని చెప్పాడు. మ‌రోవైపు శంక‌ర్ మాత్రం క‌థ ఎక్క‌డ ఆగుతుందో అక్క‌డే మొద‌లౌతుంది అని చెబితే ఇప్పుడు ర‌జినీ మాత్రం మ‌రోలా చెబుతున్నాడు. అస‌లు 2.0కు రోబో 2 అని పెట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా ఇదే. క‌థ‌కు దాంతో దీనికి అస్స‌లు సంబంధం లేదంటున్నాడు సూప‌ర్ స్టార్. అది ఇది పూర్తిగా వేరే క‌థ‌లు అని.. అక్క‌డ వ‌శీక‌ర‌ణ్, చిట్టి, స‌నా చుట్టూనే క‌థ తిరుగుతుంటే ఇక్క‌డ మాత్రం ప్ర‌పంచం చుట్టూ తిరుగుతుందంటున్నాడు ర‌జినీకాంత్. ముఖ్యంగా ఇందులో అక్ష‌య్ కుమార్ పాత్ర‌తో కావాల్సినంత మెసేజ్ శంక‌ర్ సిద్ధం చేసాడంటున్నాడు ర‌జినీ. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడున్న డిజిట‌ల్ యుగంలో మొబైల్స్ వాడ‌కంతో ఎలా పాడైపోతున్నామో చూపించాడు ఈ చిత్రంలో శంక‌ర్. ఇప్పుడు ర‌జినీ కూడా ఇదే అంటున్నాడు. 2.0 పూర్తిగా కొత్త క‌థ అని.. కేవ‌లం చిట్టి అనే పాత్ర త‌ప్ప ఇంకేం ఉండదంటున్నాడు ఈ సూప‌ర్ స్టార్. ఇప్పుడు ఈయ‌న ఇచ్చిన క్లారిటీతో చాలా ఫ్రెష్ మైండ్ తో సినిమాకు వెళ్తారు ఆడియ‌న్స్. అయితే ఎవ‌రెన్ని చెప్పినా కూడా శంక‌ర్ ఓ హాలీవుడ్ సినిమా తీసాడ‌ని చెప్పాడు ర‌జినీకాంత్. మ‌రి ఈయ‌న మాట‌లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మో న‌వంబ‌ర్ 29న తేల‌నున్నాయి.

More Related Stories