English   

శంకర్ సినిమాల్లో ‘2.0’ అతి చిన్న సినిమా..?

Rajinikanth
2018-11-20 19:33:12

సౌత్ ఇండియన్ సినిమాను నేషనల్ వైడ్ గా విస్తరించిన అతికొద్ది మంది దర్శకుల్లో శంకర్ ముందు వరుసలో ఉంటారు. ఒకప్పుడు మణిరత్నం, ప్రియదర్శన్ తర్వాత తనదైన బలమైన కథలతో దేశమంతా ఆకట్టుకునేలా సినిమాలు తీసిన జెంటిల్మన్ శంకర్. ఇండియన్ సిమాను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకువెళ్లిన మొదటి దర్శకుడ కూడా శంకరే అనడంలో డౌటే లేదు. రోబోతో ఎన్నో సంచలనాలు సృష్టించిన శంకర్ తర్వాత కాస్త తడబడ్డా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ‘2.0’ తో వస్తున్నాడు. మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ బ్యాడీగా నటిస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

రికార్డులు, రివార్డుల మేటర్ పక్కన బెడితే ఖచ్చితంగా  బాహుబలిలా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే సినిమా అవుతుందని చెప్పొచ్చు. దాదాపు 450కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను స్క్రినింగ్స్ పరంగా అత్యధికంగా ప్రదర్శించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్ లోని అతి పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్స్ గా చెప్పుకునే ‘వి.వో.ఎక్స్’ లో రోజుకు వంద ఆటలు ప్రదర్శించబోతున్నారు. 

ఇక ఈ నెల 29న వాల్డ్ వైడ్ గా విడుదల కాబోతోన్న 2.0 సెన్సార్ పూర్తయింది. ఇక విడుదలకు అన్ని రకాలుగా సిద్ధమైనట్టే. అన్నట్టు ఇది శంకర్ కెరీర్ లోనే అతిచిన్న  సినిమా. బడ్జెట్ విషయంలో కాదు.. నిడివిలో. అవును. ఇప్పటి వరకూ శంకర్ సినిమాలు నిడివిపరంగా కాస్త ఎక్కువగానే ఉండేవి. కానీ  2.0 మాత్రం కేవలం 2.28 గంటలు మాత్రమే ఉండబోతోంది. అంటే 148నిమిషాల నిడివి అన్నమాట. పూర్తిగా రెండున్నర గంటలకు అని కూడా చెప్పలేం. అయితే ఇందులో నాలుగు పాటలు మాత్రమే ఉండటం కూడా ఈ నిడివి తగ్గడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. అయితే ముందు అసలు పాటలే వద్దనుకున్నారట. అలా చేసి ఉంటే ఇది రెండు గంటల్లోనే అయిపోయే  సినిమా. ఏదేమైనా మరో ఎనిమిది రోజుల్లోనే ఈ శంకర్ విజువల్ వండర్ ఆడియన్ ముందుకు రాబోతోంది. 

More Related Stories