English   

ఆకాశంలో 2.0 బిజినెస్.. లెక్క త‌ప్పితే అరాచ‌కాలే.. 

Rajinikanth
2018-11-22 20:14:25

2.0.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఏదైనా టాపిక్ మాత్రం ఇదొక్క‌టే. త‌మిళ్ సినిమా అయినా కూడా అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రం గురించి చ‌ర్చ జ‌రుగుతుంది. పైగా ర‌జినీకాంత్ హీరో కావ‌డంతో ఇంక అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే ఈ మ‌ధ్య ఈయ‌న సినిమాలు కూడా అడ్ర‌స్ త‌ప్పుతున్నాయి. వ‌ర‌స‌గా మూడు డిజాస్ట‌ర్స్ తో తెలుగులో ఎటూ కాకుండా ఉన్నాడు సూప‌ర్ స్టార్. త‌మిళ‌నాట అంటే ఇప్ప‌టికీ ర‌జినీకాంత్ నెంబ‌ర్  వ‌న్ హీరో.. అక్క‌డ ఆయ‌న సినిమాలు రికార్డులు తిర‌గ‌రాస్తుంటాయి. కానీ తెలుగులో మాత్రం కాదు. ఒక‌ప్పుడు ఉన్న మార్కెట్ ఇప్పుడు ర‌జినీకాంత్ కు లేదు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే ఇప్పుడు 2.0 బిజినెస్ మాత్రం అరాచ‌కంగా జ‌రిగింది. ఈ చిత్రాన్ని ఒక‌టి రెండు కాదు.. 85 కోట్ల‌కు అమ్మేసారు తెలుగులో. ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఇది అద్భుతం. అస‌లు తెలుగు సినిమాల‌కే ఇంత మార్కెట్ కావ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో డ‌బ్బింగ్ సినిమాను ఇంత రేట్ కు అమ్మ‌డం నిజంగా అద్భుత‌మే. 

ప‌దేళ్ల కింద రోబో సినిమాతో 40 కోట్ల మార్క్ అందుకున్నారు రజినీ, శంక‌ర్. మ‌ళ్లీ ఇప్పుడు ఇన్నేళ్ళ త‌ర్వాత దానికి డ‌బుల్ ల‌క్ష్యంతో వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంపై ఉన్న అంచ‌నాల‌కు ఈ బిజినెస్ త‌క్కువే కానీ టాక్ మాత్రం తేడాగా వ‌చ్చిందంటే జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దు. ఆకాశమంత అంచ‌నాల‌తో వ‌చ్చిన క‌బాలి లాంటి సినిమాలే అడ్ర‌స్ లేకుండా పోయాయి. అంతెందుకు శంక‌ర్ ఐ సినిమాకు కూడా తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడు 2.0 ను తెలుగు రాష్ట్రాల్లోనే 72 కోట్లకు అమ్మేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల మార్క్ దాటింది నాన్ బాహుబ‌లిలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే. ఇప్పుడు 2.0 ఇది చేయాలి. మ‌హేశ్, ప‌వ‌న్, ఎన్టీఆర్ లాంటి సూప‌ర్ స్టార్స్ కు కూడా సాధ్యం కాని రికార్డును ఇప్పుడు ర‌జినీ చేసి చూపించాలి. లేక‌పోతే మ‌రో ఫ్లాప్ ర‌జినీకాంత్ ముందు నిలుస్తుంంది. మ‌రి చూడాలిక‌.. న‌వంబ‌ర్ 29న విడుదల కానున్న 2.0 ఏం చేయ‌బోతుందో..? 

More Related Stories