English   

2.0 సాంగ్ రిలీజ్.. రోబోల మాయాజాలం.. 

rajinikanth
2018-11-25 09:08:41

శంక‌ర్ ఏదో అద్భుతం చేస్తున్నాడ‌ని తెలుసు కానీ మ‌రీ హాలీవుడ్ సినిమానే మ‌న ముందుకు తీసుకొస్తున్నాడ‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు 2.0 విజువ‌ల్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. టీజ‌ర్ అన్నీ హాలీవుడ్ సినిమాలా ఉంటే ఇప్పుడు విడుద‌లైన పాట కూడా మ‌రో స్థాయిలో ఉంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హిందీలో తూ హిహే అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందులో అన్నీ రోబోలే క‌నిపిస్తున్నాయి. అది చూసిన త‌ర్వాత అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ పాట నిండా రోబోలే క‌నిపిస్తున్నాయి. పైగా ర‌జినీ, అమీజాక్స‌న్ కూడా పూర్తిగా రోబోల గెట‌ప్ లోనే ఉన్నారు. వీళ్ల మ‌ధ్య రొమాన్స్.. ర‌జినీకాంత్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా త‌న ట్రేడ్ మార్క్ వాకింగ్ స్టైల్ తో ప‌డేసాడు సూప‌ర్ స్టార్. అమీజాక్స‌న్ కూడా చిట్టి రోబోగా క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మాయ చేసింది. రెండున్న‌ర నిమిషాల పాట‌లోనే అద్భుతాల‌న్నీ క‌లిపి చూపించాడు శంక‌ర్. ఇక ఇదే పాట రేపు థియేట‌ర్స్ లో 3డి వ‌ర్ష‌న్ లో చూస్తుంటే బాపురే మ‌రో లోకంలో ఉన్న‌ట్లుంటుందేమో..? 

More Related Stories