English   

ర‌చ్చ మొద‌లైంది.. 2.0 వివాదం..

2.0-controversy
2018-11-28 12:50:58

ఏంట‌బ్బా సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌ప‌డింది ఇప్ప‌టి వ‌ర‌కు 2.0పై ఒక్క వివాదం కూడా లేదేంటి అని అంతా ఆశ్చర్య‌పోతున్నారు. ఎందుకంటే ఈ మ‌ధ్య ఫ్యాష‌న్ అయిపోయింది కదా.. పెద్ద సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైందంటే దానిపై ఏదో ఓ ర‌చ్చ చేయ‌డం. ఇప్పుడు 2.0 కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈ చిత్రంపై కూడా వివాదం మొద‌లైంది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేష‌న్ లో శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న 10 వేల థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఇలాంటి టైమ్ లో ఈ చిత్రంపై వివాదం అల్లుకోవడం టెన్ష‌న్ ప‌డుతుంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను. ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి 500 కోట్ల‌కు పైగా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. 8 క్రితం శంకర్ దర్శకత్వంలో వ‌చ్చిన రోబోకు ఇది సీక్వెల్. 

అప్ప‌టికీ ఇప్ప‌టికీ వ‌చ్చిన టెక్నిక‌ల్ మార్పుల‌తో హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం త‌క్కువ కానీ స్థాయిలో శంక‌ర్ '2.0' చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం ఇండియాతో పాటు మ‌రిన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో సెల్ ఫోన్ వాడకంపై ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా ఉన్నాయని.. సైన్స్ అండ్ టెక్నాలజీని తప్పు పడుతూ.. అదేదో నేరంలా చూపించార‌ని టెలికాం సంస్థ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. పైగా మొబైల్ ఫోన్స్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు నేర‌స్థుడే అని డైలాగ్ పెట్ట‌డం కూడా వివాదాస్ప‌దం అవుతుంది. సెల్ టవర్స్ వల్ల మానవాళికి ప్రమాదకరం తనే తప్పుడు మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే అది మ‌రింత ప్ర‌మాదం అంటున్నారు వాళ్లు. ఇదే సినిమాలో చూపించ‌డం వ‌ల్ల మెసేజ్ ఇంకా బ‌లంగా వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు టెలికాం ఉద్యోగులు. 

ఇది చాలా త‌ప్పు క‌దా అంటూ వివాదం రేపుతున్నారు. ఈ ఇష్యూపై చిత్ర యూనిట్ నుండి స్ప‌ష్ట‌మైన వివరణ వచ్చే వరకూ సినిమా విడుద‌ల ఆపాల‌ని డిమాండ్ చేస్తూ టెలికాం ఆపరేటర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విల‌న్. పక్షి పరిశోధకుడుగా టిస్తున్న ఖిలాడీ.. మ‌నం వాడుతున్న మొబైల్స్ వల్ల‌ పక్షిజాతులు అంతం అవుతున్నాయ‌ని కోపంతో మొబైల్ ఫోన్లపై యుద్ధం ప్రకటిస్తాడని తెలుస్తుంది. మ‌రి ఈ క‌థ ఆలోచించ‌డానికి చాలా కొత్త‌గా ఉంది.. మ‌రి దాన్ని ఎలా చూపించాడు శంక‌ర్.. నిజంగానే ఫోన్స్ పై వ్య‌తిరేకంగా సినిమా చేస్తున్నాడా చేస్తే ఎలా ఉండ‌బోతుందో అనేది అస‌లు క‌థ‌. అస‌లు ఈ వివాదం ఎక్క‌డ ముగుస్తుంద‌నేది కూడా ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 

More Related Stories