English   

2.0 ఫ‌స్ట్ రివ్యూ.. ప్రైడ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా..

2.0-Review
2018-11-29 09:48:58

2.0 సినిమా రివ్యూ వ‌చ్చేసింది. న‌వంబ‌ర్ 28 రాత్రే ప్రీమియ‌ర్స్ ప‌డిపోవ‌డం.. న‌వంబర్ 29 ఉద‌యం నుంచే అన్నిచోట్లా బెనిఫిట్ షోలు వేయ‌డంతో ఈ చిత్రం టాక్ బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇప్పుడు వ‌చ్చిన టాక్.. చెబుతున్న తీరు బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం ప్రైడ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా అన‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం అయితే క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న అంచ‌నాల‌ను నిల‌బెట్టుకోవ‌డం.. 500 కోట్ల బ‌డ్జెట్ కాపాడుకోవ‌డం అంటే చిన్న విష‌యం అయితే కాదు. ఇప్పుడు శంక‌ర్ రెండూ చేసాడంటున్నారు అభిమానులు. ముఖ్యంగా క‌థ విష‌యంలో చిన్న‌దే అయినా కూడా దాన్ని శంక‌ర్ తెర‌కెక్కించిన తీరు.. విజువ‌ల్స్ ను వాడుకున్న తీరు.. విఎఫ్ఎక్స్ అనేది మ‌రో స్థాయిలో ఉంద‌ని తెలుస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే హాలీవుడ్ సినిమాలు కూడా త‌క్కువే అనే స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు శంక‌ర్ అంటున్నారు అభిమానులు. ప్రేక్ష‌కులు కూడా 2.0 చూసి ఆశ్చ‌ర్యంతో బ‌య‌టికి రావ‌డం మాత్ర‌మే క‌నిపిస్తుందంటే ఈ చిత్రాన్ని శంక‌ర్ ఏ స్థాయిలో తెర‌కెక్కించాడో అర్థం చేసుకోవ‌చ్చు. విడుద‌లైన అన్ని చోట్ల నుంచి కూడా అద్భుత‌మైన టాక్ వ‌చ్చింది. యుఎస్ ప్రేక్ష‌కులు కూడా దీనికి ఫుల్ మార్క్స్ వేసారు. మ‌రిక్క‌డ మ‌న ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడున్న టాక్ ప్ర‌కారం అయితే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అంటున్నారు కానీ ఇక్క‌డ ఏదైనా మారుతుందా.. అదే టాక్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలిక‌.

More Related Stories