English   

‘2.0’ ప్రభంజనం తట్టుకుంటారా 

2.o
2018-11-29 17:36:21

ఒక పెద్ద సినిమా విడుదలవుతుందంటే.. ఖచ్చితంగా చిన్న సినిమాలు ఆగుతాయి. ఆ తర్వాతి వారం వస్తాయి. అది మామూలే. కానీ ఓ అతిపెద్ద సినిమా వస్తోందంటే ఆ తర్వాతి వారానికి కూడా ఖచ్చితంగా బర్డెన్ ఉంటుంది. బట్ తెలుగులో అలాంటివేం పట్టించుకోం అంటూ ఏకంగా మూడు సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం 2.0 ధాటిని తట్టుకుని నిలబడాలి. కానీ నిలబడతాయా..? అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ మరో వారం వరకూ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో మనవాళ్లు మూడు సినిమాలతో వస్తున్నారు. అదే డిసెంబర్ 7.
 
ఇప్పటికే 2.0ను ఢీ కొట్టడానికి రెడీ అయిన రామ్ గోపాల్ వర్మ మరోసారి మాట తప్పాడు. ఈ నెల 30న విడుదల చేస్తానని చెప్పిన ‘భైరవగీత’ను డిసెంబర్ 7కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అయితే ఇందకు సెన్సార్ వల్ల వచ్చిన ఇబ్బందులే కారణమని చెబుతున్నారు. ఇక స్టార్ హీరో అయిపోవాలని తెగ ప్రయత్నిస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’కూడా అదే రోజు వస్తోంది. కాజల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు నిర్దేశకుడు. టీజర్ అవీ ఆకట్టుకున్నాయి. శ్రీనివాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ గా నటించాడు. పైగా థ్రిల్లర్ అంటున్నారు. అయినా 2.0 ఊపుతో పాటు మరో రెండు సినిమాల పోటీనీ తట్టుకోవాలీ కుర్రాడు. అది సాధ్యమవుతుందా అనేదీ ప్రశ్నే.

ఇక కొన్నాళ్ల క్రితం ఫేడవుట్ అయ్యాడు అన్న దశ నుంచి మళ్లీరావాతో ఫామ్ లోకి వచ్చిన సుమంత్ రూట్ మార్చి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో వస్తున్నదే ‘సుబ్రహ్మణ్యపురం’. చూడ్డానికి కార్తికేయ కు సీక్వెల్ లా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఏ మాత్రం ఆకట్టుకున్నా సుబ్రహ్యణ్యపురంతో సుమంత్ కు మరో బ్రేక్ వస్తుంది. కానీ ఈ మూడు సినిమాలూ ఇప్పుడు 2.0 ప్రభంజనాన్ని తట్టుకోవాలి. తట్టుకుంటాయా అనేది నిజంగా ప్రశ్నే. ఒకవేళ తట్టుకున్నా ఈ మూడిట్లో ఏ మూవీ ది బెస్ట్ అనిపించుకుంటుందనేది కూడా తెలియాలి. ఒకవేళ మూడూ బావున్నా.. 2.0 ప్రభంజనం వల్లైతేనేమీ.. ఈ మూడు సినిమాలకు వచ్చే థియేటర్స్ నంబర్స్ వల్ల అయితేనేమీ .. బావున్నా బాగా ఆడతాయనే గ్యారెంటీ అయితే లేదు.  

More Related Stories