English   

మరో అరుదైన రికార్డ్ నమోదు చేసిన ‘2.0’

Rajinikanth
2018-12-29 13:09:02

దక్షిణాదిలో  ఆ వుడ్ ఈ వుడ్ అంటూ సంబంధం లేని సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కాంబినేషన్‌లో టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘2.0’ రూ.700 కోట్ల వసూళ్ల ట్రేడ్ మార్కును అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తాజాగా తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 మిలియన్ డాలర్ల మార్కును దాటిందని తాజాగా ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా టెక్నాలజీ వలన వచ్చే నష్టాల మీదే ఫోకస్ అయ్యింది. అయితే ఇక రూ.700 కోట్ల వసూళ్ల మార్కును అధిగమించడం ద్వారా ఈ సినిమా అరుదైన జాబితాలోకి చేరిందట. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 మాత్రమే ఉండగా అందులో ఇండియా నుంచి కేవలం 2 సినిమాలు మాత్రమే వున్నాయి. ఒకటి ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్'  మరొకటి రజనీ '2.ఓ'. అయితే అమీర్‌ఖాన్ సినిమాకు చైనా వసూళ్లు కలిపి ఆ మార్క్ రాగా చిట్టి చేసిన మాజిక్ వలన ‘2.0’ మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండానే  100 మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును అందుకుంది.

More Related Stories