English   

రజినీకాంత్ పరువు తీసారుగా.. చైనాలో 2.0 డిజాస్టర్..

Rajinikanth
2019-09-16 15:48:09

2.0.. ఇండియాస్ మోస్ట్ కాస్ల్టియెస్ట్ మూవీగా విడుదలైంది ఈ చిత్రం. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది 2.0. కానీ అంచనాలు అందుకోవడంతో 2.0 దారుణంగా విఫలమైంది. ఇండియాలోనే ఈ చిత్రం చాలా చోట్ల నష్టాలు తీసుకొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ అయిపోయింది. ఈ మధ్యే 2.0 ను చైనాలో 48000 స్క్రీన్స్ లో విడుదల చేసారు. ఓ ఇండియన్ సినిమాకు ఇది నిజంగా రికార్డే. చాలా వరకు బాలీవుడ్ సినిమాలు కూడా ఈ స్థాయిలో అక్కడ విడుదల కాలేదు. కానీ రజినీకాంత్ కంటే కూడా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో 2.0ను 20000 థియేట‌ర్స్.. 48000 స్క్రీన్స్లో విడుదల చేసారు. చైనాలో ఉన్న చైనాలో 75 శాతం స్క్రీన్స్ లో 2.0నే విడుదలైంది. 10 రోజుల కింద విడుదలైన ఈ చిత్రం అస్సలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే రజినీకాంత్ పరువు తీయడానికే ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసినట్లు అనిపించింది. అభిమానులు కూడా దీనిపై మండిపడుతున్నారు. సెప్టెంబర్ 6న విడుదలైన ఈ చిత్రం కనీసం 50 కోట్లు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. అక్క‌డి వాళ్ల‌కు మ‌న వార్ సినిమాలు పెద్ద‌గా న‌చ్చ‌వు. అందుకే బాహుబలి కూడా చేతులెత్తేసింది. కేవలం ఎమోషనల్ సినిమాలు మాత్రమే అక్కడ ఆడతాయి. అది పట్టించుకోకుండా టెక్నాల‌జీ ఎక్కువ‌గా ఉన్న 2.0 ను విడుదల చేసారు. వాళ్ల దగ్గరే ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చుంటాయి. అందుకే 2.0ను కనీసం పట్టించుకోలేదు చైనీయులు. 6 మిలియన్ వసూలు చేస్తే కానీ అక్కడ హిట్ అనిపించుకోదు ఈ చిత్రం. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 3 మిలియన్ కూడా కష్టమే. మొత్తానికి రజినీకాంత్ సినిమాకు దారుణమైన పరాభవం చైనాలో ఎదురైంది.

More Related Stories