English   

శంక‌ర్ 2.0.. టార్గెట్ 2000 కోట్లు

Rajinikanth's 2Point0 Movie Business Target 2000 Crores
2018-09-14 09:42:38

ఇప్పుడు ఇండియ‌న్ సినిమాలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఇన్నాళ్లూ ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఊహించుకున్నారు కానీ ఇప్పుడు టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత శంక‌ర్ విజ‌న్ చూసి అంద‌రికీ పిచ్చెక్కిపోతుంది. సినిమాకు 540 కోట్లు పెట్టించాడంటే ముందు ఏంటీ అరాచ‌కం అనుకున్నారు కానీ హాలీవుడ్ సినిమాలు కూడా బిత్త‌ర‌పోయే విజువ‌ల్స్ తో అరిపించాడు శంక‌ర్. ఇక ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మాట ఒక్క‌టే.. 2000 కోట్ల వైపు 2.0 ప‌రుగులు తీస్తుందా లేదా అని..? ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాలో కేవ‌లం ఇండియాలో 2000 కోట్లు సాధించిన సినిమా ఏదీ లేదు. బాహుబ‌లి 2 కూడా 1700 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది.

దాంతో ఇప్పుడు ఈ రికార్డుల‌న్నీ 2.0 అందుకుంటుందేమో అనే ఆస‌క్తి.. అంచ‌నాలు అంద‌ర్లోనూ క‌నిపిస్తున్నాయి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ర‌జినీకాంత్ తో పాటు అక్ష‌య్ కుమార్, శంక‌ర్ కూడా ఉండ‌టంతో అన్ని ఇండ‌స్ట్రీల్లో హైయ్య‌స్ట్ బిజినెస్ చేస్తుంది ఈ చిత్రం. తెలుగులో 90 కోట్ల‌కు పైగానే 2.0 హక్కులు అమ్మారు. ఇక త‌మిళ‌, హిందీల్లో కూడా వంద‌ల కోట్ల బిజినెస్ చేస్తుంది ఈ చిత్రం. పైగా సినిమా కూడా అంతా 3డిలోనే చేసారు కాబ‌ట్టి ఖచ్చితంగా ఆ ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఒక‌వేళ ఈ చిత్రం కానీ 2000 కోట్లు వ‌సూలు చేస్తే.. మ‌ళ్లీ శంక‌ర్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ అయిపోతాడు. మ‌రి చూడాలి.. ఈ ఛాలెంజ్ ను ఈయ‌న ఎలా స్వీక‌రిస్తున్నాడో..? న‌వంబ‌ర్ 29న 2.0 విడుద‌ల కానుంది.

More Related Stories