English   

2.0 ..  ఇది కదా కిక్కిచ్చే న్యూస్ అంటే

Rajinikanth-2.0
2018-10-29 05:22:11

2.0 శంకర్ డైరెక్షన్ లో వస్తోన్న సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ టాప్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన సినిమా. బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్.  ఈ మూవీ ప్రొడక్షన్ ఎప్పుడో పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం చాలా టైమ్ తీసుకుందీ మూవీ. నిజానికి రెండేళ్ల క్రితమే వస్తుందనుకున్నారు. భారీ బడ్జెట్.. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అనుకున్నంత బాగా రాకపోవడంతో శంకర్ బాగా టైమ్ తీసుకున్నాడు. మొత్తంగా మోస్ట్ అవెయిటెడ్ మూవీగా చెబుతూ వస్తోన్న ఈ మూవీపై ఒకదశలో ఇంట్రెస్ట్ పోయింది కూడా. బట్.. రీసెంట్ గా మళ్లీ తన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు శంకర్. నవంబర్ 29న 2.0 వాల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుందని పక్కాగా చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. 

ఇక ఈ మూవీ ట్రైలర్ ను నవంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో రజినీతో పాటు శంకర్ అభిమానుల్లో కూడా కొత్త జోష్ వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్ డేట్ లో ఏ వాయిదాలూ ఉండవన్న నిర్ధారణకు వచ్చారంతా. మొత్తంగా ఇప్పటి వరకూ ప్రపంచం ఎన్నో యుద్ధాలు చూసింది. హాలీవుడ్ సినిమాల్లోనూ మరెన్నో యుద్ధాలు ఇలా రాబోతున్నాయి అనేలా ఊహాత్మక కథలూ చూసింది. వాటన్నిటికీ భిన్నంగా శంకర్ ఓ కొత్త యుద్ధాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నానని చెప్పకనే చెప్పాడు.. అదే ‘మొబైల్ వార్’. అంటే మన చేతిలో ఉన్న సెల్ ఫోనే మనకు శతృవు. లేదా శతృవుకు ఆయుధంగా మారుతుంది. ఈ కాన్సెప్ట్ ను తెలియజేస్తూ రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కే తిరుగులేని క్రేజ్ వచ్చింది. మరి ఈ ట్రైలర్ ను బట్టి ఇక సినిమాను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో ఊహించేయొచ్చు. 

More Related Stories