English   

బాహుబలి రెండు భాగాలను మించిన 2.0

Rajinikanth
2018-11-03 18:27:08

రాజమౌళి బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమాకు తిరుగులేని క్రేజ్ తెచ్చాడు. అంతకు ముందే ఈగతో ఎట్రాక్ట్ చేసిన రాజమౌళి బాహుబలితో ఆ స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ లో సెట్ చేశాడు. అటు శంకర్ కూడా రోబోతో ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ సినిమాను తలపించాడు. ఈ రెండు సినిమాలతో ఈ దర్శకులకు ఇండియాలో ఓ ప్రత్యేకమైన గౌరవ ప్రతిభలు ఆపాదిచండం మొదలైంది. కానీ ఈగ, రోబోల తర్వాత మళ్లీ నెక్ట్స్ లెవెల్ అందుకోవడంలో రాజమౌళి ముందున్నాడు. ఆల్రెడీ రెండు భాగాలూ తీయడమే కాదు.. రెండువేల కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ తో బిజీ అయిపోతున్నాడు. ఈ టైమ్ లో కాస్త లేట్ అయినా శంకర్ ఆ నెక్ట్స్ లెవెల్ కు లేటెస్ట్ గా రాబోతున్నాడు. అదే 2.0. బట్.. ఈ మూవీ ఒక విషయంలో విడుదలకు ముందే బాహుబలి రెండు భాగాలనూ దాటిపోయింది. ఈ విషయం రజీనీకాంత్ స్వయంగా చెప్పడం విశేషం.

బాహుబలిని దాటడం అనేది ఆఫ్టర్ రిలీజ్ కాదు. బిఫోర్ రిలీజ్. అది కూడా బడ్జెట్ లో. యస్.. శంకర్ 2.0 కోసం వెచ్చించిన బడ్జెట్ ఏకంగా 600 కోట్లు. కానీ రాజమౌళి బాహుబలి రెండు భాగాలకు కలిపి కూడా 450కోట్లు దాటలేదు. కానీ ఆ సినిమా రెండు భాగాలతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2800కోట్ల వరకూ వసూలు చేసింది. అంటే శంకర్ సినిమాకు బడ్జెట్ తో పనిలేకుండా ఆ టార్గెట్ రీచ్ అయితే కనక ఖచ్చితంగా శంకర్ తోపు అవుతాడు. లేదంటే బాహుబలి రికార్డ్స్ ఇప్పుడప్పుడే బద్ధలు కావడం సాధ్యం కాదు. మరి శంకర్ 2.0 వాల్డ్ వైడ్ గా 2800కోట్లు సాధిస్తుందా అనేది పెద్ద ప్రశ్న అనే చెప్పాలి. 

More Related Stories