English   

2.0.. అస‌లు ఎంత దారుణం ఇది..? 

Rajinikanth-2.0

ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 450 కోట్ల ప్రాజ‌క్ట్.. ఇలాంటి సినిమాను ఇలాగేనా డీల్ చేయ‌డం.. శంక‌ర్ తీరు చూసి ఇప్పుడు అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా అనుకుంటున్న మాట ఇదే. ఇన్నాళ్లూ ఈయ‌నకు ఉన్న ఇమేజ్ మొత్తం ఇప్పుడు 2.0తో పోయేలా క‌నిపిస్తుంది. భారీ బ‌డ్జెట్ సినిమాలు చేయ‌డం శంక‌ర్ కు పెద్ద క‌ష్ట‌మైన ప‌నికాదు.. ఆయ‌న ప్ర‌తీసారి చేసేది అదే. కానీ ఇప్పుడు 2.0 విష‌యంలో మాత్రం ఆయ‌న ఫాలో అవుతున్న తీరు మాత్రం అంద‌రికీ షాక్ ఇస్తుంది. సినిమా ఇంత లేట్ అవుతున్నా.. ఓ వైపు నిర్మాత‌ల‌కు న‌ష్టం వ‌స్తున్నా కూడా ఈయ‌న మాత్రం ఏ చ‌ల‌నం లేకుండా ఉన్నాడు. ఇదే ఇప్పుడు అంద‌రికీ షాక్. సినిమా సంగ‌తి దేవుడెరుగు.. టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. ఆయ‌న ఎలాగూ విడుద‌ల చేయ‌డ‌ని.. ఈ మ‌ధ్యే లీకు వీరులు టీజ‌ర్ ను విడుద‌ల చేసారు. మిగిలిన ద‌ర్శ‌కులైతే టీజ‌ర్ ఎలాగూ లీక్ అయింది క‌దా అని దాన్నే అఫీషియ‌ల్ గా విడుద‌ల చేస్తారు. 

కానీ అక్క‌డున్న‌ది శంక‌ర్.. అలా చేస్తే ఆయ‌న శంక‌ర్ ఎందుకు అవుతాడు..? అందుకే ఇప్పుడు చిత్ర‌యూనిట్ కు పిచ్చెక్కించే షాక్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ ఎలాగూ వ‌చ్చింది క‌దా.. పాత టీజ‌ర్ నే విడుద‌ల చేద్దాం అంటే వ‌ద్దు చూసిన టీజ‌ర్ వ‌స్తే నేను ఒప్పుకోనంటూ కొత్త టీజ‌ర్ సిద్ధం చేయిస్తున్నాడు శంక‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టీజ‌ర్ విడుద‌ల కాలేదు.. సినిమా ఎప్పుడొస్తుందో తెలియ‌దు. ఒక‌టి రెండు కాదు ఏడాదిన్న‌ర‌గా ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు అభిమానులు. పైగా ఇప్పుడు ర‌జినీకాంత్ వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నాడు. మొన్నొచ్చిన కాలా కూడా డిజాస్ట‌రే. ఈయ‌న త‌న స్టామినా నిరూపించుకోవాలంటే 2.0 వ‌చ్చి తీరాల్సిందే. ఒక్క హిట్ ప‌డితే కానీ ఆయ‌న కెరీర్ ఇప్పుడు గాడిన ప‌డ‌దు. కానీ శంక‌ర్ మాత్రం ఇవ‌న్నీ వ‌దిలేసి ఇండియ‌న్ 2 అంటూ క‌మ‌ల్ సినిమాపై కాన్స‌ట్రేట్ చేస్తున్నాడు. 2018లో 2.0 రాద‌ని అర్థ‌మైపోయింది.. వ‌చ్చే ఏడాదికి సినిమా వాయిదా ప‌డింది. క‌నీసం అప్పుడైనా వ‌స్తుంది అనే క్లారిటీ ఇవ్వ‌ట్లేదు శంక‌ర్. మ‌రి ఈ చిత్రంతో ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories