English   

భారతీయుడు -2 కు భలే కాస్టింగ్ సెట్ అయింది..

Simbu-Shankar
2018-11-14 09:57:43

భారతీయడు ... 1995లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. కమల్ హాసన్ నట విశ్వరూపానికి తార్కాణంగా, దర్శకుడు శంకర్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన సూపర్ హిట్ సినిమా. ఊర్మిళ, మనీషా కోయిరాలా హీరోయిన్లుగా నటించారప్పుడు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఓ నిజాయితీపరుడైన వ్యక్తి.. లంచం ఇవ్వలేకపోవడం వల్ల తన కూతురు కళ్ల ముందే చనిపోతే.. ఆ లంచగొండి తనానికి వ్యతిరేకంగా హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో బ్రేక్ ఇన్స్ పెక్టర్ అయిన తన కొడుకు కూడా లంచం తీసుకుని ఓ స్కూల్ వ్యాన్ కు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తాడు. దీంతో  ఆ వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కొందరు పిల్లలు చనిపోతారు. అప్పుడు తన కొడుకు అని కూడా చూడకుండా అతన్నీ చంపేస్తాడీ భారతీయుడు. అంతటి నిజాయితీపరుడాయన. తండ్రి, కొడుకులుగా కమల్ హాసనే నటించాడు. మొత్తంగా అప్పట్లో ఓ ఊపుఊపేసిందీ సినిమా.. పాటలు కూడా నేటికీ సూపర్బ్ గా వినిపిస్తుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండానే అద్భుతమైన మెసేజ్ కూడా అందించాడు శంకర్. అందుకే ఈ మూవీకి సీక్వెల్ అంటే చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం అసలు ఉంటుందా..? లేక రూమరా అనుకున్నారు. బట్ ఫైనల్లీ భారతీయుడుకు సీక్వెల్ మొదలు కాబోతోంది. ఇందులో ప్రధాన పాత్రలు కూడా ఫైనల్ అయ్యాయి. 

ఇక ఫస్ట్ పార్ట్ లో కొడుకు పాత్ర చనిపోయింది కాబట్టి.. కమల్ ఒక్కడే ఉంటాడు. ఆయన భారతీయుడు. ఇక ఇతర పాత్రల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అనూహ్యంగా ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి మరో ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ చేరారు. తమిళ్ స్టార్ శింబు, మళయాల స్టార్ దుల్కర్ సాల్మన్ భారతీయుడు -2లో నటిస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫార్మ్ అయింది. ఇక ఫస్ట్ పార్ట్ లో సిబిఐ ఆఫీసర్ గా నటించి మళయాల నటుడు నెడిముడి వేణు ఈ సీక్వెల్ లోనూ అదే పాత్రలో కనిపించబోతుండటం విశేషం. చూస్తోంటే ఈ ప్రాజెక్ట్ కూడా మరో భారీ సినిమాగా రూపొందే అవకాశం ఉంది. ఈ నెల 29న శంకర్ సినిమా ‘2.0’ విడుదలవుతోంది. ఇది రిలీజ్ అయిన వెంటనే భారతీయుడు -2 ప్రారంభం అవుతుంది.

More Related Stories