English   

బాహుబ‌లి 2 ఇష్టం లేదంటున్న రాజ‌మౌళి..

SS Rajamouli says about Baahubali 2
2018-12-25 20:02:02

అదేంటి త‌ను తీసిన సినిమానే క‌దా.. పైగా ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను తిర‌గ‌రాసిన ఓ చ‌రిత్ర ఇష్టం లేద‌ని రాజ‌మౌళి ఎందుకు చెబుతాడు అనుకుంటున్నారా..? రెండు కళ్లలోని ఏదంటే ఇష్టం అంటే ఎవరైనా ఏం చెప్తారు..? అసలు ఇది ప్రశ్నేనా అనుకుంటున్నారా.. ఇప్పుడు రాజమౌళికి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. కాఫీ విత్ కరణ్ షోలో ఈయనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. బాహుబలి రెండు భాగాల్లో ఏదంటే మీకు బాగా ఇష్టమని కాఫీ విత్ కరణ్ షోలో రాజమౌళి ని అడిగాడు కరణ్ జోహార్. దీనికి రాజమౌళి కాస్త ఆలోచించి సమాధానం చెప్ప‌డం చాలా కష్టమని చెప్పాడు. అంతలోనే బాహుబలి ది బిగినింగ్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు రాజమౌళి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అప్పటి వరకు తెలుగు సినిమా ఎన్నడూ చూడనంత బడ్జెట్ తో బాహుబలి వచ్చింది.
బాహుబలి 2 మరింత భారీగా రావడానికి కారణం కూడా బాహుబలి తొలి భాగమే. పార్ట్ 1 ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే రెండో భాగాన్ని ఇంకా అద్భుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. అందుకే రెండో భాగం కంటే కూడా తొలి భాగం అంటేనే తనకు మరింత ప్రత్యేకం అని చెప్పాడు రాజమౌళి. ఆరంభం అద్భుతంగా ఉంది కాబట్టే ముగింపు అంతకంటే అద్భుతంగా ఉందని చెప్పాడు జక్కన్న. కమర్షియల్ వైజ్ గా రాజమౌళిని అగ్రస్థానంలో కూర్చోబెట్టిన సినిమా బాహుబలి 2. కానీ ఈయన మాత్రం బాహుబలి పార్ట్ వన్ అంటే తనకు ఇష్టమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజమౌళి సమాధానం విని అక్కడే ఉన్న ప్రభాస్ కూడా షాక్ అయ్యాడు. అందుకేనేమో మ‌హానుభావులు మాట్లాడే మాట‌లు అస్స‌లు అర్థం కావ‌ని చెప్పాడు నాని.

 

More Related Stories