English   

ఎఫ్ 2 లో ప‌వ‌న్ ఫ్యాన్స్ కి స‌ర్‌ప్రైజ్‌

varun tej surprise to pawan kalyan fans in f2 movie
2018-12-31 11:26:38

మెగా హీరోలు ఆడియో ఫంక్ష‌న్లలో, సినిమాలలో చేసినా ప‌వ‌న్ క‌ల్యాణ్ జపం చేయాల్సిందే. అదో అలవాటుగా మారిపోయింది.  వాస్తవానికి ప‌వ‌న్‌ పేరుని మెగా హీరోల కంటే బ‌య‌టి హీరోలయిన నితిన్ లాంటోళ్ళు ఎక్కువగా వాడతారు. ఇక చిన్నా చితకా హీరోల సంగతి చెప్పనవసరం లేదనుకుంటా. మరి అలా బయట వాళ్ళు వాడినప్పుడు మెగా హీరోలు వాడుకుంటే త‌ప్పేంటి అని మెగా అభిమానుల ఫీలింగ్. అందుకే తాజాగా వ‌రుణ్‌ తేజ్ ఇప్పుడు ‘ఎఫ్ 2’లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గుర్తు చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్‌ల‌పై ఓ పాట తెర‌కెక్కించారట. అందులో వెంకీ, వ‌రుణ్ ఇద్ద‌రూ రైల్వే కూలీల డ్రెస్‌ లలో క‌నిపిస్తారు. అందుకు సంబంధించిన స్టిల్ ఆ మధ్య ఎప్పుడో బ‌య‌ట‌కు వచ్చింది. ఆ పాటలోనే వ‌రుణ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గుర్తు చేసేలా మేన‌రిజ‌మ్స్ ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని తెలిసింది. ఈ విష‌యాన్ని దిల్ రాజు కూడా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లూ ఇచ్చాడు. ఆ పాటలో వెంక‌టేష్ కూలీ నెంబ‌ర్ వ‌న్ గెట‌ప్‌లో క‌నిపిస్తే , వ‌రుణ్‌ తేజ్ కూడా ప‌వ‌న్‌ త‌మ్ముడులో వేసిన డ్రెస్ వేసుకుంని చెప్పుకొచ్చాడు దిల్‌రాజు. త‌మ్ముడిలో ‘వ‌య్యారి భామ నీ హంస న‌డ‌క‌’ పాట కోసం ప‌వ‌న్ కూలీ అవ‌తారం ఎత్తాడు, ఇప్పుడు వ‌రుణ్‌ కూడా అదే గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నాడన్న మాట.

More Related Stories