English   

ఎఫ్ 2 నిలబెడుతుందా ?

Varun-Tej
2019-01-02 12:26:40

పండగ సినిమాలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ సంక్రాంతికి రానున్న ఒక్కో సినిమా ఒక్కో స్థాయిలో బిజినెస్ చేసింది. నాలుగు సినిమాల్లోకెల్లా కొద్దోగొప్పో తక్కువగా అంచనాలున్న సినిమా స్టార్ వాల్యూ తక్కువగా ఉన్న సినిమా ఎఫ్ టు. వరుణ్ తేజ్ వెంకటేష్ లాంటి హీరోలు ఉన్నా కూడా ఈ చిత్ర బిజినెస్ 40 కోట్లకు కింద జరుగుతుంది. దిల్ రాజు చాలా చోట్ల ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు. పండక్కి ఈ సంక్రాంతి అల్లుడు వస్తున్నారు కచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు. 

వరుణ్ తేజ్ వెంకటేష్ మార్కెట్ కంటే ఎక్కువ ఈ సినిమాను అమ్మేస్తున్నారు దిల్ రాజు. ఇప్పటివరకు వెంకీ కెరీర్లో 40 కోట్ల మార్కు సోలోగా అందుకున్నది లేదు. ఆయన హయ్యెస్ట్ కలెక్షన్స్ 30 కోట్లు లోపే ఉన్నాయి. ఇక వరుణ్ తేజ్ కూడా ఫిదా మినహాయిస్తే 30 కోట్ల మార్కు అందుకోలేదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా బిజినెస్ కూడా 35 కోట్ల వరకు జరుగుతుంది. ఖచ్చితంగా పండగ సీజన్లో ఈ చిత్రం నవ్వుల ప్రయాణం సాధిస్తుందని కుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని ధీమాగా చెబుతున్నారు దిల్ రాజు. వరుసగా మూడు విజయాలు తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న నాలుగో సినిమా. కచ్చితంగా ఈ చిత్రంతో ఈయన డబుల్ హ్యాట్రిక్ కు ముహూర్తం పెడతారు అని నమ్మకంగా ఉన్నారు.

సంక్రాంతికి వచ్చిన మిగతా మూడు సినిమాల కంటే ఎఫ్2 కు కాస్త విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా కుటుంబ కథ కావడం వెంకటేష్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం వైపు అడుగులు వేస్తారని నమ్ముతున్నారు దర్శకనిర్మాతలు. మొత్తానికి పండగ బరిలో దిగుతున్న ఈ సంక్రాంతి అల్లుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

More Related Stories