English   

ఎఫ్ 2 ట్రైల‌ర్ వ‌స్తుంది.. గెట్ రెడీ ఫోక్స్ నవ్వుకోడానికి..

Venkatesh and  Varun Tej multi star movie f2 trailer
2019-01-07 19:10:20

సినిమాకు బిజినెస్ పెరగాలంటే ముందు టీజర్.. ఆ తర్వాత ట్రైలర్ అద్భుతంగా ఉండాలి. ఒక్కోసారి సినిమాలో విషయం తక్కువగా ఉన్నా కూడా ట్రైలర్ బాగుంటే ఓపెనింగ్స్ బ్ర‌హ్మాండంగా వస్తాయి. వాటిపై ఎక్కువ ప్రభావం చూపించేది కూడా ట్రైలరే. అలాంటి ట్రైలర్ ను ఇన్ని రోజులు విడుదల చేయకుండా ఆపి ఉంచారు ఎఫ్ 2 టీం. ప్రీ రిలీజ్ వేడుక జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ట్రైలర్ రాలేదు. ఇక ఇప్పుడు దీనికి సమయం వచ్చింది.. విడుదలకు కేవలం ఐదు రోజుల ముందు ఈ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 7 సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది.
కచ్చితంగా ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతాయని నమ్ముతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. పైగా వెంకటేష్, వరుణ్ తేజ్  క్రేజీ కాంబినేషన్ కావడం కూడా ఎఫ్2 సినిమాకు కలిసి రానుంది. అన్నింటికీ మించి ఈ సినిమా కోసం దిల్ రాజు కావాల్సినన్ని థియేటర్లు పక్కన పెట్టాడు. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఎఫ్ 2 పండక్కి ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అన్ని బాగుండి సినిమాకు పాజిటివ్ టాక్ గాని వచ్చిందంటే ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం. వెంకటేష్ ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు కూడా ఎఫ్ 2 వైపే ఉంటుంది. మొత్తానికి ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎలాంటి కొత్త సంచలనాలకు తెర తీస్తుందనేది చూడాలి.

More Related Stories