English   

ఎఫ్ 2 ట్రైల‌ర్.. పండక్కి బాగా న‌వ్వించేలా ఉన్నారుగా..

Venkatesh and Varun Tej's f2 movie release on january 12th
2019-01-07 21:34:57

ఒకప్పుడు తెలుగులో కామెడీ సినిమాలు చేయాలంటే జంధ్యాల, ఇ.వి.వి సత్యనారాయణ లాంటి దర్శకులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన దర్శకులు మరొకరు లేరు. త్రివిక్రమ్ లాంటి దర్శకులు కామెడీ చేసినా కూడా వాళ్ల మెయిన్ స్ట్రీమ్ అది కాదు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రం నాటి మేటి దర్శకులను గుర్తు చేస్తున్నాడు. పూర్తిగా కామెడీ సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. తొలి సినిమాలో పటాస్ నుంచి నవ్వించడం అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నాడు అనిల్. సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలు కూడా సూపర్ కామెడీతోనే విజయం సాధించాయి. ఇప్పుడు ఏకంగా ఎఫ్ 2 సినిమా అయితే ఫ‌స్ట్ సీన్ నుంచి చివరి వరకు కేవలం నవ్వించడం మాత్రమే లక్ష్యంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు అనిల్ రావిపూడి.
ట్రైలర్ చూసిన తర్వాత కడుపు చెక్కలైపోవడం ఖాయం. రెండు నిమిషాల ట్రైలర్ ఇలా ఉంటే రెండున్నర గంటల సినిమా ఎలా ఉంటుందో మన ఊహకి వదిలేశాడు దర్శకుడు అనిల్. ముఖ్యంగా వెంకటేష్ గత కొన్నేళ్లుగా ఎప్పుడూ చూడనంత కామెడీ చేశాడు ఈ సినిమాలో. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి టైంలో వెంకీ చేసిన కామెడీ గుర్తొస్తుంది ఎఫ్2 ట్రైల‌ర్ చూస్తుంటే. వరుణ్ తేజ్ కూడా కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి కామెడీ రోల్ చేసాడు.. పైగా తెలంగాణా స్లాంగ్ తో అదరగొట్టాడు మెగా వారసుడు. తమన్నా, మెహరీన్ బికినీ అందాలతో రచ్చ చేశారు. ఎటు చూసుకున్న ఎఫ్2 హిట్టు కళ‌ కళ్లముందు కనిపిస్తోంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

More Related Stories