English   

భారతీయుడు2 లో శింబు !

Simbu play key role in Kamal Haasan's bharateeyudu 2 movie
2019-01-12 23:09:20

‘2.ఓ’ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న తెరకెక్కిస్తున్న సినిమా ‘ఇండియన్‌ 2’(భారతీయుడు 2).  లంచగొండితనం మెయిన్ లీడ్ గా తీస్కుని తెరకెక్కిన ‘ఇండియన్‌’(భారతీయుడు) సినిమాకి సీక్వెల్‌ గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్‌ ను ఎంపిక చేయగా. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కూడా ముఖ్యపాత్ర పోషించనున్నట్లు కోలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పాత భారతీయడు లో తండ్రి, కుమారుడిగా కమలే ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘ఇండియన్‌ 2’లో కమల్‌ మనవడిగా శింబు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే సినిమా ప్రకారం సేనాపతికి మనవడు, చంద్రబోస్ కు కుమారుడిగా శింబు కనిపిస్తారని కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. చాలా డిఫరెంట్ గా శింబు పాత్రను శంకర్ మలిచాడని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా శంకర్ కానీ శింబు కానీ ధ్రువీకరించలేదు. మొదట ఈ సినిమాని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాలని ప్రయత్నం చేసినా ఎందుకో గానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని కూడా నిర్మిస్తోంది.

More Related Stories