English   

గుండమ్మ కథ ప్రేరణతోనే ఎఫ్2 !

f2
2019-01-14 05:50:31

గుండమ్మ కథ అనే సినిమా తెలియని తెలుగువారు ఎవరైనా వున్నారా ? అంటే దాదాపు లేరనే చెప్పాలి ఈ జనరేషన్ పిల్లలు తప్ప. ఈ సినెమా విజయా వారి నుండి వచ్చిన సినిమాలలో ఒక మచ్చు తునక. ఇది వారి చివరి విజయవంతమైన నలుపు తెలుపుల చిత్రం కావడం మరో విశేషం. అయితే ఆ మధ్య తెలుగులో పాత చిత్రాలను తిరిగి రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఉత్సాహాన్ని కనబరిచారు. ఆ తర్వాత ఆ ఆలోచన మూల పడింది అనుకోండి, అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే తాజాగా విడుదలయి సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఎఫ్2 కి ప్రేరణ గుండమ్మ కధేనట. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి తనకు 'గుండమ్మ కథ' సినిమా అంటే ఇష్టమని ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ సినిమా చేశానని, 'గుండమ్మ కథ'లోని సూర్యకాంతం పాత్రని ఎఫ్2లో ప్రగతితో చేయించానని చెప్పుకొచ్చాడు. గుండమ్మ కధ లాంటి మల్టీ స్టారర్‌ ఎప్పటికైనా చేయాలనే కోరిక ఉండేదని ఆ ప్రభావం ఈ సినిమాలోని పాత్రల్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే మొదటి మూడు సినిమాలు యాక్షన్ ప్రధానమున్న సినిమాలు కాబట్టి ఈ సినిమా ఇలా ప్లాన్ చేశానని, సినిమాలపై ఆసక్తి ఏర్పడిన దగ్గర నుంచి జంధ్యాల, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి ప్రభావం ఎక్కువ పడిందని చెప్పుకొచ్చాడు. అంతే కాదండోయ్ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా వుందట. 

More Related Stories