English   

రోబో 2.ఓ సినిమాకు అరుదైన గౌరవం !

2.0' nominated for 'highest recognition in sound design
2019-01-20 08:51:25

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో క్రేజీయస్ట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 2.ఓ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే తాజాగా 2.ఓ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. రోబో 2.ఓ గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయిందట. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ కి గాను విదేశీ విభాగంలో 2.ఓ నామినేట్‌ అయినట్లు ఈ సినిమా సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఫేమస్మోషన్ పిక్చర్‌ సౌండ్‌ ఎడిటర్స్‌ (ఎంపీఎస్‌ఈ) ఈ అవార్డులను ఇస్తుంది. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా ఫిబ్రవరి 17వ తేదీన ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. 2.ఓతో పాటు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు వేర్వేరు విభాగాల్లో అవార్డులకు ఎంపికయ్యాయి. వాస్తవానికి రసూల్‌ పూకుట్టి 4డీ ఎస్‌ఆర్‌ఎల్‌ అనే సౌండ్‌ ను 2.ఓ ద్వారా ఈ సినిమా ప్రపంచానికి పరిచయం చేశారు. అదీ ఈ సాంకేతికను మన ఇండియన్‌ సినిమా ద్వారా ఆవిష్కరించడం ఇప్పటికే రికార్డ్ సృష్టించగా ఇప్పుడు మరో అరుదైన ఘనత లభించినట్టయింది. రసూల్‌ కి ఇప్పటికే ఆస్కార్‌ అవార్డు, హోమ్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అవార్డ్, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ వంటి అవార్డులు దక్కాయి. ఇప్పుడు గోల్డెన్‌ రీల్‌ పురస్కారానికి అతని పేరు నామినేట్‌ కావడం ఆయన పనితనానికి మచ్చు తునక. 

More Related Stories