English   

ఎఫ్2 దూకుడు మామూలుగా లేదుగా.. ఎంత టార్గెట్..? 

F2
2019-01-21 11:29:33

రోజు రోజుకి సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంది ఎఫ్2 సినిమా. అసలు ఈ చిత్రం దూకుడు ఇంతగా ఉంటుందని దిల్ రాజు కూడా ఊహించలేదు. విడుదలైన ఎనిమిది రోజుల తర్వాత ఈ చిత్ర కలెక్షన్లు చూస్తుంటే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 43 కోట్ల షేర్ తీసుకొచ్చి అనిపించింది ఈ చిత్రం. 35 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎఫ్ టు సినిమా కేవలం ఐదు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ జోన్ కు తీసుకొచ్చింది. ఆరవ రోజు నుంచి అన్ని లాభాలే. ఇక ఇప్పటికే చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ల పంట పండించింది ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేషన్. ముఖ్యంగా గత ఏడాది వరుస పరాజయాలతో డీలాపడిన దిల్ రాజు కెరియర్ కు ఈ సినిమా మళ్ళీ ఊపిరి పోసింది. 

ఎఫ్ 2 దూకుడు చూస్తుంటే సులభంగా 60 కోట్ల షేర్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్. మరోవైపు అనిల్ రావిపూడి కూడా వరుసగా నాలుగో విజయాన్ని అందుకుని తన రేంజ్ ఇంకా పెంచుకున్నాడు. ఇప్పుడు ఈ కుర్ర దర్శకుడితో సినిమా చేయాలని స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. ఈయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. పండగ సెలవులని పూర్తిగా క్యాష్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ చిత్రం. మొత్తానికి మరి చూడాలి ఇంకా ఎంత దూరం వెళుతుందో ఎఫ్2 ప్రయాణం.

More Related Stories