English   

ఎఫ్2 నెక్ట్స్ టార్గెట్ అత్తారింటికి దారేది.. కాస్కో నా రాజా.. 

F2
2019-01-30 05:26:17

ఒకరోజు గడుస్తుంటే ఎఫ్2 సినిమా ఒక్కో రికార్డును దాటేస్తూ పోతుంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇంకా ఎన్ని రికార్డులు బద్దలైపోతాయో కూడా క్లారిటీ రావడం లేదు. రోజురోజుకు దూకుడు పెరుగుతూనే ఉంది కాని తగ్గడం లేదు. 17 రోజుల తర్వాత ఈ చిత్రం ఏకంగా 75 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ 125 కోట్లకు చేరిపోయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడంతో దూకుడు అడ్డు లేకుండా పోయింది. గబ్బర్ సింగ్, గీతగోవిందం ఇలాంటి సినిమాల రికార్డులను ఇప్పటికే దాటేసింది ఎఫ్ 2 సినిమా. ఇప్పుడు వెంకటేష్, వరుణ్ తేజ్ చూపులు అత్తారింటికి దారేది సినిమాపై పడ్డాయి. ఈ చిత్రం పేరు మీద ఉన్న 80 కోట్ల రికార్డును అందుకోవాలని చూస్తుంది ఎఫ్2. ఇదే జోరు కొనసాగితే ఈ వారంలోనే అత్తారింటికి దారేది కూడా మాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర అస్సలు తగ్గడం లేదు ఈ ఎఫ్ 2. ఫుల్ రన్లో 90 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇదేగాని జరిగితే అనిల్ రావిపూడి సరికొత్త సంచలనానికి తెర తీసినట్లే. చూడాలి మరి.. అత్తారింటికి దారేది రికార్డును వరుణ్ తేజ్ అందుకుంటాడో లేదో.

More Related Stories