English   

ఓరి దేవుడో.. అమెజాన్ లో ఎఫ్2 వచ్చేస్తుంది.. 

F2
2019-02-07 18:14:14

ఈ సంక్రాంతికి వచ్చి సంచలన విజయం సాధించింది ఎఫ్2 సినిమా. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 125 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. షేర్ కూడా 77 కోట్లకు పైగానే ఉంది. వరుణ్ తేజ్, వెంకటేష్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పటికీ వసూలు సాగిస్తూనే ఉంది ఈ సినిమా. నాలుగు వారాల తర్వాత కూడా మంచి వసూళ్లు తీసుకొస్తూ  డిస్ట్రిబ్యూటర్ల పంట పండిస్తోంది ఎఫ్2 చిత్రం. ఇక అప్పుడు అమెజాన్ లో ఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన 40 రోజుల తర్వాత అమెజాన్ లో విడుదల చేస్తారు కానీ ఈ విషయంలో మాత్రం కేవలం నెల రోజులు మాత్రమే ఆ గ్యాప్ పెట్టుకున్నాడు నిర్మాత దిల్ రాజు. దాంతో జనవరి 12న విడుదలైన ఈచిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం 30 రోజుల వ్యవధిలోనే బ్లాక్ బస్టర్ సినిమా అమెజాన్లో వస్తుండడంతో అభిమానులు నిజంగానే పండగ చేసుకుంటున్నారు. థియేటర్లలో చూడని వాళ్లకు ఇప్పుడు ఇంట్లోనే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చూపించబోతున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. ఏదేమైనా మరీ ఇంత తక్కువ గ్యాప్ లో బ్లాక్ బస్టర్ సినిమా అమెజాన్ లో విడుదల కావడం మాత్రం నిజంగానే నిరాశ పరిచే విషయం. ఇప్పటికీ వసూలు వస్తున్న తరుణంలో ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తే థియేటర్లకు వెళ్లేవారు ఇక వెళ్లరు. దాంతో వచ్చే కలెక్షన్స్ ఆగిపోయినట్లే. కనీసం యాభై రోజుల వ్యవధి ఉంటే అది సినిమాకు కూడా మంచిదంటున్నారు విశ్లేషకులు.

More Related Stories