English   

'భారతీయుడు 2' షూట్ ఆగలేదట !

Kamal-Haasan
2019-02-09 17:23:12

కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా గత నెల 18న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి వృద్ధుడి గెటప్ లోని కమల్ ఫస్ట్ లుక్ కూడా బయటికి వచ్చింది. అయితే ఆ తరువాత కమల్ లుక్ అనుకున్నట్టుగా రాలేదనే అసంతృప్తితోనో లేక మరేదైనా కారణమో తెలీదు కానీ ఆ షూటింగును ఆపేశాడనే ప్రచారం జరిగింగి. అయితే ఈ ప్రచారం మీద సినిమా తరపు నుండీ ఎవరూ స్పందించక పోవడంతో ఈ వార్త నిజమే అని అనుకున్నారు. అయితే ఈ విషయం మీద తాజాగా కమల్ స్పందించారు. భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు శంకర్ చేసిన పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తాను చేస్తోన్న వృద్ధుడి పాత్రకి సంబంధించిన మేకప్ బాలేదని శంకర్ అనుకుంటున్నాడని వచ్చిన వార్తలను కూడా కొట్టి పారేసిన ఆయన ఈ సినిమాలో తన వృద్ద్ద మేకప్ చాలా చక్కగా కుదిరిందని ఈ విషయంలో శంకర్ పూర్తి క్లారిటీతో వున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కాజల్ నటించనుండగా మరో కీలక పాత్ర కోసం శింభు లేదా సిద్దార్దలను తీసుకున్నారని వార్తలు వచ్చాయి, దీని మీద అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక క్లారిఫికేషన్ రాలేదు.

More Related Stories