English   

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ పార్ట్ 2 వ‌స్తుందా.. మ‌రో యూరీ ఖాయ‌మేనా..?

The Surgical Strike movie sequel
2019-02-27 19:44:09

దేశ‌మంతా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ గురించే మాట్లాడుకుంటుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా వ‌స్తుంద‌ని తెలుస్తుంది. యూరీ  పార్ట్-2 రాబోతుందని అప్పుడే బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఇండియా మొత్తం ఇప్పుడు ఒకటే టాపిక్ వినిపిస్తుంది.. పాకిస్తాన్ ను గడగడలాడిస్తూ ఇండియన్ ఆర్మీ ప్రయోగించిన ఎయిర్ ఫోర్స్ బాంబులు దాయాది దేశపు ఉగ్ర మూకలను మట్టుబెట్టాయి. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ లో దాదాపు 300 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడి గురించి ఇండియా మొత్తం గర్వంగా చెప్పుకుంటున్నారు. మన ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలు గుర్తు చేసుకుంటూ వాళ్లకు సలాం చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ఈ సర్జికల్ స్ట్రైక్ సపోర్ట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి స‌లాం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్ ను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే తొలి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఆధారంగా వచ్చిన uri సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం 230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా పార్ట్2 తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారం. తొలి భాగం మాదిరే రెండో భాగం కూడా సంచలన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. 2020లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories