English   

 షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2...హ్యాపీ బర్త్ డే శ్రద్దా !

Shades-Of-Saaho
2019-03-03 02:34:57

బాహుబలి లాంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న మూవీ సాహో. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నుంచి కొద్ది సేపటి క్రితమే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 అంటూ ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. గతంలో ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా తొలి షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 పేరుతో రిలీజ్ చేసిన చిత్రయూనిట్, ఈరోజు మార్చి 3న శ్రద్ధా కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2ను రిలీజ్ చేసింది.  కెన్నీ బేట్స్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన యాక్షన్ సీక్వెన్స్ లను వీడియోలో చూపించారు. మొత్తానికి సినిమా హాలీవుడ్ రేంజ్ లో  ఉందని చెప్పక తప్పదు, ఈ వీడియో లో కూడా ఎక్కువగా ఫారెన్ నటులనే చూపారు, ఇక కొన్ని యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిన విధానాన్ని కూడా చూపారు, చివర్లో బర్త్ డే భామ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో గన్ ఫైరింగ్ చేస్తున్న విజుయాల్ చూపారు. ఇక పూర్తిగా చివరిలో ప్రభాస్ ఒకరితో చేస్తున్న ఫైట్ ని చూపి ప్రభాస్ తో భూం అనిపించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. మిర్చి సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన మధి, సాహోని ఈ సినిమాని విజువల్ ఫీస్ట్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అవనుందని ప్రకటించినా ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు.

More Related Stories