English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2...లోకేష్ మీద ఒట్టు !

Ramgopalvarma Lakshmi's NTR trailer out
2019-03-08 16:03:44

బాలకృష్ణకి పోటీగా ఎన్టీఆర్ బయోపిక్స్  మొదలెట్టిన వర్మ ట్రైలర్స్ తో కలకలం రేపుతున్నాడు. ఎన్టీఆర్ బాల్యం నుండి ఆయన సతీమణి బసవతారకం మరణం దాకా బాలయ్య సినిమా ఉంటె అక్కడి నుండి ఎన్టీఆర్ మరణం దాకా వర్మ లైన్ తీసుకుని సినిమా చేశాడు. ఈ రోజు మహిళ దినోత్సవం సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ట్రైలర్ యూట్యూబ్‌‌ లో రికార్డుల దిశగా పయనిస్తోంది. ఎన్టీఆర్ జీవితకథనుయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఆయన జీవిత భాగస్వామి అయ్యే దాకా ఎలా జరిగిందని మొదటి ట్రైలర్‌లో  చూపిన వర్మ రెండో ట్రైలర్‌ను కూడా అంతే ఇంటెన్సిటితో కట్ చేసాడు. కుటుంబ సభ్యులు, లోకులు లక్ష్మి గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే బాధ పడిన ఎన్టీఅర్ వారికి ఇష్టం లేకున్నా ఎదురించి పెళ్లి చేసుకోవడం ..ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రిగా గద్దె దించారనే దాన్ని ట్రైలర్‌లో చూపెట్టారు.

 

ట్రైలర్‌ మొదటిలో వాడితో కలిసి నా పిల్లలూ నన్ను చంపేసారు అంటూ వేసిన ఒక స్లైడ్ ద్వారా ఆయన్ని టార్గెట్ చేశాడు వర్మ.  లక్ష్మీపార్వతికి వేరే వాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయని చంద్రబాబు తో ఎన్టీఆర్‌తో చెప్పించడం. జయసుధ,జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ ఉన్నా లక్ష్మీ పార్వతినే ఎందుకు పెళ్లిచేసుకున్నాడని ఎన్టీఆర్ కూతుళ్ళలో ఒకరితో చెప్పించడం లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నీచంగా చూసే సన్నివేశాలు లాంటివి ట్రైలర్ లో ఉన్నాయి. ఆయనను చంపవద్దని లక్ష్మి పార్వతి అడగడం దానికి కొనసాగిమ్ప్గా నా కొడుకు లోకేష్ మీద ఒట్టు అని బాబు చెప్పడం చూస్తే ఈ సిన్మా ద్వారా ఎన్ని సంచలనాలు ప్లాన్ చేశాడో ఏమో అనే అనుమానాలు మొదలవుతున్నాయి. 

More Related Stories